లైఫ్ స్టైల్: డయాబెటిస్ వారు ఉపవాసం చేయవచ్చా? చేస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Divya
ఇటీవల కాలంలో చాలామంది ఏదైనా చిన్న పండుగ వచ్చిందంటే చాలు ఉపవాసం మొదలు పెడుతూ ఉంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం చేయాలనుకున్నా.. అనారోగ్య కారణంగా చేయలేకపోతున్నారు. ఒకవేళ మీరు కూడా డయాబెటిస్ సమస్యతో బాధపడుతూ ఉపవాసం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఉపవాస దీక్ష మొదలు పెట్టవచ్చు. డయాబెటిస్ రోగులు భారతదేశంలో ఎక్కువవుతున్నారు . ఇక ఈ వ్యాధికి ఇప్పటికీ కూడా సరైన ఔషధాలు లేకపోవడం గమనార్హం.

ఇకపోతే ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం,  ఆధునిక జీవన శైలి , పోషకాహారాలు తీసుకోకపోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ముఖ్యంగా డయాబెటిస్ తో  బాధపడుతున్న వారు తప్పనిసరిగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే డయాబెటిస్ యొక్క తీవ్రతను అదుపులో ఉంచవచ్చు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. ఇలా  చెయ్యడం. ముఖ్యంగా డయాబెటిస్ తో  బాధపడుతున్న వారు ఉపవాసాలు ఎక్కువగా చేస్తున్నారు. అలాంటి వారి శరీరంలో రక్తంలోని చక్కర పరిమాణం హెచ్చుతగ్గులకు గురి అవుతుంది.

మరి డయాబెటిస్ తో  బాధపడుతున్న వారు ఉపవాసం చేసేటట్లయితే వైద్యుడు సలహా మేరకు ఉపవాసం చేపట్టడం మంచిది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల పాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉపవాస సమయంలో చాలామంది తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.  ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపవాసం చేసే క్రమంలో తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇక ఉప్పు,  చక్కెర అధిక పరిమాణాలు ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం మంచిది.

అంతేకాదు ఉపవాసం చేయాలనుకున్నా.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట డ్రై ఫ్రూట్స్ అల్పాహారంలో భాగంగా తీసుకుంటే సరిపోతుంది. అంతేకాదు శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. వీలైనంతవరకు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు రోజుకు నాలుగు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇకపోతే పైన చెప్పిన సూచనలను పాటిస్తూ డయాబెటిస్ వారు కూడా ఉపవాసం చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: