హార్ట్ స్ట్రోక్ : ఈ లక్షణాలే సంకేతం?

Purushottham Vinay

ఇక గుండె సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా కనిపించవచ్చు. అయితే కొందరిలో స్ట్రోక్ రావడానికి కొన్ని సంవత్సరాల ముందే డిప్రెషన్ లక్షణాలు అనేవి కనిపిస్తాయని సరికొత్త అధ్యయనంలో తేలింది.‘స్ట్రోక్‌తో బాగా బాధపడుతున్న వ్యక్తులలో డిప్రెషన్ అనేది చాలా సాధారణ సమస్య. అయితే స్ట్రోక్‌ తర్వాతే డిప్రెషన్‌ లక్షణాలు గణనీయంగా పెరుగుతాయని చాలామంది కూడా భావిస్తారు. అయితే స్ట్రోక్ సంభవించడానికి ముందే చాలామందిలో డిప్రెషన్‌ లక్షణాలు అనేవి బయటపడతాయి’ అని తమ అధ్యయనంలో తేలిందని జర్మనీలోని మన్స్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు మరియా బ్లోచ్ల్ తెలిపారు.ఇక సుమారు 65 ఏళ్ల వయస్సు ఉన్న 10,797 మందిని సుమారు 12 ఏళ్ల పాటు పరీక్షించి ఈ అధ్యయనం చేసినట్లు మరియా తెలిపడం జరిగింది. ఇంకా వీరిలో చాలామందికి ప్రారంభంలో ఎలాంటి గుండెపోటు సమస్యలు లేవు. అయితే అధ్యయనం సమయంలోనే సుమారు 425 మందికి గుండెపోటు సమస్యలు అనేవి తలెత్తాయి. 


ఇంకా ఇదే సమయంలో సమాన వయసు, లింగం, జాతి తదితర ఆరోగ్య లక్షణాలున్న మరో 4, 249మందిని స్ట్రోక్‌ బాధితులతో పోల్చగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఒంటరితనం ఇంకా నిద్రలేమి తదితర డిప్రెషన్‌ సమస్యలున్నప్పటికీ ఎలాంటి గుండెపోటు సమస్యలు తలెత్తలేదని ఈ పరిశోధనలో తేలింది.కాగా ఇక స్ట్రోక్ సమయానికి ఆరు సంవత్సరాల ముందు, తరువాత స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల స్కోర్లని పరిశీలించగా వారంతా కూడా దాదాపు 1.6 పాయింట్లతో సమానంగా ఉన్నారు. కానీ హార్ట్ స్ట్రోక్‌కు దాదాపు రెండు సంవత్సరాల ముందు, గుండె సమస్యల బారిన పడిన వారి సంఖ్య సగటున 0.33 పాయింట్లు పెరగడం అనేది ప్రారంభమైంది.ఇక స్ట్రోక్ తర్వాత, డిప్రెసివ్ లక్షణాలు ఈ గ్రూప్‌కి అదనంగా 0.23 పాయింట్లు పెరిగడం జరిగింది.కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. తగిన జాగ్రత్తలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: