భార్యా, భర్తలు చెప్పుకొలేని మూడు విషయాలు ఇవే..

Satvika
భార్యాభర్తలు ఎంత అన్యొన్యంగా ఉన్నా కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి అంటే మాత్రం వెనకడుగు వెయ్యాల్సిందే.. అలాంటి విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..అందరి దృష్టిని ఆకర్షించిన ఓ జంట గురించి ఇప్పుడు చూద్దాం..టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా వినయ - విజయ్ పాల్గొని ప్రైజులు కొట్టేశారు. ఇదంతా ఏడాది క్రితం; అంత చక్కని జంట ఇప్పుడు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది..



ఇద్దరి మధ్య కొన్ని విషయాలలో పరిధులుంటాయి. భార్యాభర్తలు ఒకరితో ఒకరు పంచుకోకుండా ఉండే కొన్ని విషయాలు ఉంటాయని వినయ విజయ్ జంట గ్రహించలేదంతే.వివాహానంతరం భార్యాభర్తల అనుబంధం ఎంత బాగా ఉన్నా.. ఇద్దరి మధ్యా తరచూ పంచుకోని విషయాలు ఉంటానేది కాదనలేం. ప్రతి ఒక్కరికీ వారి స్వంత రహస్యాలు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయాలను ఎవరితోనూ పంచుకోరు. ఇది మాత్రమే కాదు, ఏ జంట అయినా గతం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు.కొన్ని సంగతులు మనసు పొరల్లో దాచుకుని భాగస్వామితో పంచుకోకపోతేనే ఆ సంసారం సజావుగా సాగుతుంది. లేదూ మనసులో మాటను చెప్పుకుంటే, అది వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. వైవాహిక జీవితంలో చీలిక ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, భాగస్వామిపై నమ్మకం పోతుంది. భార్యాభర్తల మధ్య సంబంధంలో అనుమానం చోటు చేసుకుంటుంది.


ఆమె లేదా అతను గురించిన జ్ఞాపకాలు మనసులో మెదిలే క్షణాలు వస్తూనే ఉంటాయి. అది కేవలం ఊహే కావచ్చు. అది ఊహే అయినా మీ భాగస్వామితో పంచుకోవడం మంచిది కాదు..చాలా మంది మగవారు సాధారణంగా భార్యకు వారిలో ఉన్న లోతైన లైంగిక కల్పనల గురించి చెప్పడానికి ఇష్టపడరు. ఇవి పంచుకోవడం వల్ల క్యారెక్టర్‌కి హాని కలుగుతుందని భావిస్తారు. భార్య తనిని ద్వేషించడం మొదలుపెడుతుందని, ఈ విషయం తెలియగానే తనలో అనుమానం మొదలవుతుందనే ఆలోచన కూడా వస్తుంది..కొత్త వ్యక్తులతో మెసేజ్ లు అన్నీ కాస్త ఆనందాన్ని ఇస్తాయని భావిస్తారు. గతంలోని మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉంటారు. ఇవి తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చినా, విషయం తెలిసాకా భార్యాభర్తల వైవాహిక జీవితంలోనూ మనస్పర్థలు మొదలవుతాయి. వీటికి దూరంగా పోనవసరం లేదు. కాస్త జాగ్రత్తగా మసులుకుంటే సరి.మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యభర్తల మధ్య అన్యోన్యత కలకాలం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు...ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే చాలా బాగుంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: