లైఫ్ స్టైల్: డయాబెటిస్తో బాధపడుతున్నారా.. అయితే వీటిని తినండి..!!

Divya
ముఖ్యంగా ప్రకృతిలో లభించే ప్రతి వివిధ రకాల పండ్ల ద్వారా మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. కానీ వాటిని ఏరకంగా తీసుకుంటే మనకు తగినన్ని పోషకాలు లభిస్తాయి అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే డయాబెటిస్ అనేది ప్రాణాంతక వ్యాధిగా మారిపోతుంది. దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పబడే ఇది సైలెంట్ కిల్లర్ గా కూడా వైద్యులు పరిగణిస్తున్నారు. మరి డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవాలి అంటే జామకాయ మంచి మెడిసిన్ అని చెబుతూ ఉండడం గమనార్హం.
ధర తక్కువ పైగా అన్ని సీజన్లో కూడా విరివిగా లభించే ఈ జామకాయలను తినడం వల్ల మనకు కావలసిన అన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభించడమే కాకుండా ఎన్నో రకాల పోషకాలను కూడా పొందవచ్చు. ముఖ్యంగా జామకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక మంచి ఔషధం లాంటిది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంచడానికి జామకాయలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇక జామకాయలలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం వంటి పోషక గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి రోగాలు కూడా దరిచేరవు.
ఇక జామకాయలలో గ్లైసోమిక్ ఇండక్షన్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇకపోతే జామకాయతో పాటు నేరేడు పండ్లు కూడా చాలా చక్కగా మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. అటు జామకాయలు , ఇటు నేరేడు పండ్ల లో రెండింటిలో కూడా షుగర్ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక ఆపిల్ కూడా డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరం అని చెప్పవచ్చు. ఇందులో ఉండే సాల్యుబుల్ , అన్ సాల్యుబుల్ ఫైబర్ కారణంగా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను తగ్గించవచ్చు. ఇక ఆపిల్ తో పాటు కివి పండు కూడా మధుమేహానికి చక్కటి మెడిసిన్. అలాగే ఆరెంజ్ కూడా ప్రతిరోజు తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: