లైఫ్ స్టైల్: కొలెస్ట్రాల్ ను తగ్గించే అద్భుతమైన మార్గాలు ఇవే..!

Divya
ఇటీవల కాలంలో చాలామంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇది మన శరీరంలో కనిపించే మైనపు లాంటి పదార్థం ఇది. కొవ్వు ఎక్కువగా కణాలలో కనిపిస్తుంది. ఇక మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ , చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఇక చెడు కొలెస్ట్రాల్ అనేది శరీరంలో రక్తప్రసరణను అడ్డుకుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు రక్త ప్రసరణ ఆగిపోవడం, గుండెపోటు, అధిక బరువు, రక్తహీనతతో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతాయి ఇకపోతే అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది .ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదు అని వైద్యుల సైతం సలహా ఇస్తున్నారు.
ఇక ఎలాంటి ఆహారాన్ని తినకూడదు అనే విషయానికి వస్తే చికెన్ అసలు తినకూడదు. వాస్తవానికి కొలెస్ట్రాల్ అధికంగా ఉండే చికెన్ తీసుకుంటే మాత్రము చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇక ఇది శరీరంలో రక్తప్రసరణ మరింత దిగజార్చుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఒకవేళ మీరు చికెన్ ను ఇష్టపడితే వారానికి ఒకసారి తింటే సరిపోతుంది.
పాల ఉత్పత్తులను కూడా కొంతవరకు దూరంగా ఉంచడమే మంచిది. ఎందుకంటే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు తక్కువ ఫ్యాట్ ఉన్న పాలను మాత్రమే తీసుకోవాలి. లేకపోతే శరీరంలో మరింత కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది ఇక పాలల్లో ఉండే అధిక ఫ్యాట్ మీ శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి అధికంగా క్రీం ఉండే పాలు,  పాలు నుండి తయారు చేసే ఇతర ఉత్పత్తులను దూరంగా ఉంచాలి.
అంతేకాదు రెడ్ మీట్ ను తినడం మర్చిపోవాల్సిందే. రెడ్ మీట్ అధికంగా తినడం వల్ల కొలెస్ట్రాల్ శాతం మరింత పెరిగిపోయి.. మీ అనారోగ్యానికి చలా హానికరంగా మారుతుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక ప్రాసెస్డ్  ఫుడ్, జంక్ ఫుడ్ బయట దొరికే ఆహార పదార్థాలను దూరంగా పెట్టడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: