ఇలా చేస్తే చంకలో నలుపు తగ్గి దుర్వాసన రాదు!

Purushottham Vinay
చాలా మందికి కూడా చెమట కారణంగా హార్మోన్ల లోపాలు ఇంకా సరికాని షేవింగ్ లేదా అకాంథోసిస్ నిగ్గర్స్ కారణంగా చంక ప్రాంతం బాగా నల్లబడుతుంది. ఇంకా విపరీతంగా దుర్వాసన కూడా వస్తుంది. బాక్టీరియా పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అందువల్ల దురద కూడా ఎక్కువగా ఉంటుంది.ఇది నిజం చెప్పాలంటే ఒక భయంకరమైన చర్మ వ్యాధి అని కూడా చెప్పవచ్చు. స్త్రీల కంటే ఎక్కువగా చాలా మంది భారతీయ పురుషులు ఈ చర్మ వ్యాధితో పోరాడుతారు. దీనికి ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.ఇక దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే బేకింగ్ సోడా అనేది మీ చంకలను తేలికపరచడంలో సహాయపడే ఉత్తమ పదార్థం ఇది. ఇందుకు మందపాటి పేస్ట్ చేయడానికి బేకింగ్ సోడాను నీటితో కలపండి. ఇప్పుడు, ఈ పేస్ట్‌ను మీ చంకలపై వారానికి రెండుసార్లు బాగా స్క్రబ్ చేయండి. మీరు స్క్రబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత, ఆ మిశ్రమాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత ఆ ప్రాంతాన్ని ఆరనివ్వండి.ఇంకా అలాగే మీ ఇంట్లో వుండే కొబ్బరి నూనెతో ప్రతిరోజూ కూడా మీ చంకలను మసాజ్ చేయండి.ఇంకా ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.


ఇంకా అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ కొవ్వును తగ్గించడమే కాకుండా, సహజమైన క్లెన్సర్ అయిన తేలికపాటి ఆమ్లాలను కలిగి ఉన్నందు వలన మృతకణాలను కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది. బేకింగ్ సోడాతో రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మీ చంకలపై అప్లై చేయండి. ఇప్పుడు ఐదు నిమిషాలు ఇక అలాగే ఉంచి, ఆరిన తర్వాత చల్లటి నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ కలపండి. ఆ తరువాత మీ ఇంట్లో తయారుచేసిన ఎక్స్‌ఫోలియేటర్ మీ కోసం సిద్ధంగా ఉంది. ఒక రెండు నిమిషాలు స్క్రబ్ చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి.ఆ తరువాత, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.ఇంకా అలాగే నిమ్మకాయను సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా కూడా పరిగణిస్తారు. మీరు ప్రతి రోజూ రెండు లేదా మూడు నిమిషాలు మీ చంకలో సగం నిమ్మకాయను రుద్దితే, మీరు గణనీయమైన తేడాను ఈజీగా గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: