లైఫ్ స్టైల్ : ఈ టిప్స్ పాటిస్తే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ మీ సొంతం ..!!

Divya
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో తినడానికి కూడా సమయం లేదా.. లేదా మీరు ఆరోగ్యాన్ని మీ ఫిట్నెస్ స్థాయిని చేరుకోలేక పోతున్నారా ..? అయితే బాధపడాల్సిన అవసరం లేకుండా.. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న మార్పులు మీ లైఫ్ స్టైల్ లో మార్చుకుంటే కచ్చితంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇకపోతే మీరు కిలోమీటర్ల దూరం నడవాల్సిన అవసరం లేదు.. భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడిస్తే చాలు మీ శరీరం ఫిట్ గా ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.
నిద్రపోయే ముందు ఇలా చేయాలి.. మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా మూడు గంటలకు ముందు మాత్రమే ఆహారం తినాలి. అంతేకాదు నిద్రపోయే రెండు గంటల ముందు సెల్ ఫోన్, టీవీ లాంటివి చూడడం మానేయాలి. ఇక ఇలా చేయడం వల్ల మీరు తిన్న ఆహారాన్ని శరీరం జీర్ణం చేయడానికి దానికి సులువుగా ఉంటుంది. ఇక మంచి నాణ్యమైన నిద్ర కూడా వస్తుంది. రాత్రి సమయంలో అల్పాహారం తో సరిపెట్టుకోకుండా చక్కగా భోజనం చేయడం ఉత్తమమైన పని.
బయట ఫుడ్ కు దూరంగా ఉండాలి.. రోజువారి ఆహార పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ముఖ్యంగా బయట దొరికే చిరు తిండ్లను , జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా ఉండడం మంచిది. ఇక నైట్ డ్యూటీ చేసేవాళ్లయితే ఇంట్లో తయారు చేసుకొని ఆఫీసుకు వెళ్లి భోజనం చేయడం మంచిది. ముఖ్యంగా రాత్రిపూట తప్పనిసరిగా భోజనం చేయాలి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి.. ఇక పని భారంలో పడి,  ఒత్తిడి వల్ల  కలిగే..ఆందోళన , నిరాశ,  తలనొప్పి, గుండె జబ్బులు,  నీరసం,  జీర్ణాశయ సమస్యలు , అల్జీమర్స్ వంటి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎన్నో విధానాలను మీరు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం.. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితం గడపడం వల్ల ఇలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: