మీ భార్యతో పొరపాటున కూడా ఈ రెండు విషయాలు చెప్పొద్దు ప్లీజ్ ?

VAMSI
పెళ్లి చేసుకున్న క్షణం నుండి ఇద్దరు దంపతులు కూడా తమ బంధాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని సాగించాలి. ఎలా అంటే భార్య , భర్తల మధ్య అస్సలు దాపరికాలు ఉండకూడదు అని అంటుంటారు. భార్య భర్తలో సగం. అయితే భర్త అన్ని విషయాలు కూడా భార్య తో పంచుకోకూడదు అంటున్నారు ఆచార్య చాణక్యులు. భర్త కొన్ని విషయాలు భార్య తో పంచుకోవడం వలన లేని పోని సమస్యలు ఎదురవుతాయి అని అంటున్నారు. ఆచార్య చాణక్య జీవితానికి సంబంధించి ఎన్నో ముఖ్య విషయాలను సూత్రాలను వెల్లడించారు.  అవన్నీ కూడా నిజ జీవితం లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, ఎందరో చాణుక్యుని నీతి శాస్త్రాలను అనుకరిస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
కాగా ఆయన వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో కీలక విషయాలను వివరించగా అందులో ఇది కూడా ఒకటి. అయితే భర్త ముఖ్యంగా ఈ రెండు విషయాలను అస్సలు భార్య తో చెప్పకూడదు అట. ఇంతకీ ఆ రెండు అంశాలు ఏమిటి అంటే...  
అవమానం....మీకు ఎక్కడైనా ఏమైనా అవమానం జరిగినట్లయితే ఆ విషయాన్ని భార్యతో పంచుకోకూడదు  అట. ఎందుకంటే, భార్య ఏదైనా సరే తనకి తన భర్త ఉన్నాడు అని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది భర్తకే అవమానం జరిగింది అతడు చిన్న చూపు చూడబడ్డాడు అంటే వారి నమ్మకం అంతా కరిగిపోతుంది. ఒక రకమైన చిన్న చూపు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.
ఇక రెండో విషయం ఏమిటి అంటే తన బలహీనతలు గురించి కూడా భర్త తన భార్య తో చెప్పకూడదు అని ఆచార్య చాణక్యులు చెప్పారు. ఎందుకనగా మన బలహీనతలు అనేవి మనలోని లోపాలు అని అనుకొనే అవకాశం ఉంది. అర్దం చేసుకునే భార్య అయితే పర్వాలేదు కానీ లేదంటే దీని వలన చాలా సమస్యలు ఎదురవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: