లైఫ్ స్టైల్: శరీరంలో టాక్సిన్స్ బయటకు పోవాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే..!!

Divya
ఇక సాధారణంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు పదార్థాలను బయటకు తొలగించుకోవాలి.. లేకపోతే మరి ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటున్నారు. ఇక ప్రతి రోజూ బీట్రూట్, ఆపిల్, క్యారెట్ తో తయారుచేసిన జ్యూస్ తాగినట్లయితే శరీరంలోని విష పదార్ధాలు కూడా బయటకు తొలగిపోతాయి. ఈ మూడింటితో తయారు చేసిన జ్యూస్ ని తాగడం వల్ల ప్రేగులు, కాలేయం, రక్తనాళాలు కూడా శుభ్రం అవుతాయి.
ఇకపోతే వీటితో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా ఈ మూడింటిని శుభ్రంగా కడగాలి. తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్ళు పోసి గ్రైండ్ పట్టుకోవాలి .ఇప్పుడు దీనిని వడగట్టి మీరు ప్రతిరోజు పరగడుపున తాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇకపోతే క్యారెట్ కాలేయ పనితీరును పెంచుతుంది. కాలేయంలో విషపదార్థాలు పేరుకుపోవడం నిరోధించి మెరుగైన పనితీరును ప్రోత్సహించడంలో పనిచేస్తుంది.
ఇక ఆపిల్ విషయానికి వస్తే ఆపిల్ లో ఉండే పెక్టిన్ వల్ల జీర్ణ వ్యవస్థ నుండి విషపదార్థం బయటకు తొలగిపోతుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రించవచ్చు. కాలేయం పనితీరు మెరుగుపరుస్తుంది. ఇక బీట్రూట్ ప్రయోజనాల విషయానికి వస్తే రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని అందించి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. ఈ జ్యూస్ లో మీరు కావాలి అంటే కొంచెం నిమ్మరసం రుచికోసం కలుపుకుని తాగవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఈ జ్యూస్ ఒక నెల రోజులపాటు తాగినట్లయితే కంటి చూపు మెరుగవడమే కాకుండా కాలేయం, రక్తనాళాలు కూడా శుభ్రం అవుతాయి. అయితే క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: