లైఫ్ స్టైల్: నేరేడు పండ్లతో కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Divya
నీలం రంగులో నిగనిగలాడుతూ లోపల గులాబి రంగు వర్ణము కలిగిన నేరేడు పండ్లు తినడానికి రుచికి పుల్లగా.. తియ్యగా చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో నేరేడు పళ్ళు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక ఇటీవల వేసవికాలంలో విరివిగా లభించే ఈ పండ్లలో మనకు విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, గ్లూకోజ్, ఫైబర్ , ఫ్రక్టోజ్, యాంటీ యాక్సిడెంట్ లు ఇలా అమోఘమైన పోషకాలు నిండి ఉంటాయి. అందుకే ఆరోగ్యపరంగా నేరేడు పండ్లు అనేక ప్రయోజనాలు అందిస్తాయి అని ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఇకపోతే నేరేడు పండ్లు కొంతమంది తినడానికి ఇష్టపడరు. కాబట్టి అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా ఈ కథనం రూపొందించడం జరిగింది. నేరేడు పండ్ల వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం ఎవరైనా సరే వద్దు అని అననే అనరు. ముందుగా ఒక కప్పు నేరేడు పండ్లు తీసుకుని శుభ్రంగా నీటితో కడగాలి. ఇలా కడిగిన పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. బ్లెండర్ లో వేసి.. ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు , నాలుగు టేబుల్ స్పూన్ ల బ్రౌన్ షుగర్,  చిటికెడు బ్లాక్ సాల్ట్,  సగం గ్లాసు నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక దీనిని మీరు జ్యూస్ రూపంలో తాగితే రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా ఈ జ్యూస్ అందిస్తుంది.
ముఖ్యంగా కంటిచూపును మెరుగు పరచడంలో ఈ జ్యూస్ చాలా చక్కగా పని చేస్తుందని చెప్పవచ్చు. నేరేడు పండ్లలో ప్రత్యేక పోషకాలు ఉండటం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేయవచ్చు. అంతే కాదు ప్రతిరోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువ. రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా కాలేయాన్ని శుభ్రం గా ఉంచుతుంది . ఇక క్యాన్సర్ కణాలను దూరం చేయడంతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.. చర్మం ఎప్పుడూ నిగారింపుగా ఉండాలంటే నేరేడు పండ్లు తినాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: