మీ పిల్లల్ని సరిగా పెంచి సమాజ అభివృద్ధికి హెల్ప్ చేయండి ?

VAMSI
నేటి సమాజంలో ఎవ్వరికీ తెలియని ఒక సమస్య ఎన్నో దారుణాలకు కారణం అవుతోంది అని చెప్పాలి. మనము ప్రతి రోజూ సరిగా గమనిస్తే ... న్యూస్ పేపర్ లో లేదా టీవీ లలో డ్రగ్స్, అత్యాచారం, మరియు మర్డర్ లకు సంబంధించిన కేసులలో దాదాపుగా 90 శాతం 25 సంవత్సరాల లోపు యువకులే చేసి ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. అయితే ఇలా చిన్న వయసులో ఇలా ప్రమాదకరమైన వ్యక్తులుగా మారడానికి ముఖ్య కారణం ఎవరు అంటే... అందరూ చెప్పే మొదటి పేరు పేరెంట్స్... అవును ఇది 100 శాతం నిజం.. ఒక బిడ్డ తప్పు చేశాడు అంటే ఆ తల్లితండ్రులు ప్రథమ కారణం అవుతారు.
వారే కనుక ఆ పిల్ల వాడిని సరిగా పెంచి ఉంటే, మంచి చెడుకు తేడా తెలియచేస్తూ సమాజంలో అసలు తన పాత్ర ఏమిటి అన్నది చెప్పి ఉంటే సదరు పిల్లవాడు ఈ దారుణాలకు పాల్పడే అవకాశం చాలా తక్కువగా ఉండేది.
అయితే పిల్లలు కూడా నేడు పెద్దలు అంటే భయపడడం లేదు.. ఇష్టానుసారంగా గౌరవం లేకుండా ఒకరకమైన జీవితానికి అలవాటు పడ్డారు. కాబట్టి నేడు పిల్లలు ఉన్న తల్లితండ్రులు మరియు రాబోయే కాలంలో పిల్లలు కలగనున్న తల్లితండ్రులు కూడా ఏ విధంగా  వారిని మంచి మార్గంలో నడిపించాలి అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే పిల్లల్లో ఇలా విభిన్నమైన మార్పులు రావడానికి కారణం సమాజం మరియు తల్లితండ్రులు ఇద్దరూ.
నేడు వస్తున్న సినిమాలు సీరియల్స్ లలో వస్తున్న దృశ్యాలను చూసి మెల్ల మెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. ఇక తల్లితండ్రులు తమ బిడ్డల మీద ఉన్న ప్రేమతో గారాబంగా పెంచడం కూడా కారణమే. చిన్న తప్పు చేసినప్పుడే పేరెంట్స్ వారిని సరిగా మందలించి ఆ తప్పు వలన జరిగే నష్టం గురించి వివరంగా చెప్పినట్లు అయితే ఇంకోసారి ఆ తప్పు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే పిల్లలను మనము సపోర్ట్ చేసి వెనకేసుకు వస్తామో ..  అప్పుడు తప్పుకు వారికి అర్దం తెలియదు. కాబట్టి ఈ క్షణం నుండి అయినా మీ పిల్లలను ఒక పద్దతిలో పెంచండి. రేపటి సమాజానికి ఒక మంచి మనిషిని అందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: