క్యాన్సర్ : ముందే గుర్తించి నయం చెయ్యడం ఎలా?

Purushottham Vinay
ఇక క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి కూడా తెలిసిన విషయమే. ఇక ఇది మనిషి ఆరోగ్యాన్ని పాడుచేసి చివరికి ప్రాణాలు తీసే శక్తీ కలది.కాబట్టి ఈ క్యాన్సర్ వ్యాధిని దీని లక్షణాలను మొదట్లోనే గుర్తించినట్లయితే కొంత వరకు మీకు మేలు జరిగినట్లే.అలానే ఈ వ్యాధిని ముందుగానే గ్రహించడం వలన నివారించే అవకాశం కూడా లేకపోలేదు.ఈ క్యాన్సర్‌ లక్షణాలు అవయవానికీ అవయవానికీ కూడా మారిపోతాయి. అయితే క్యాన్సర్‌ రోగులందరిలో కొన్ని ఒకేరకానికి చెందిన లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లో కూడా అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కొంచెం కష్టతరమైన విషయంగా కూడా చెప్పుకోవచ్చు . తల నుంచి శరీరం కింది భాగం వరకు కూడా ఆయా అవయవ భాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ వ్యాధిని గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి.ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్‌ గ్లాండ్స్‌ , బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర వాపు ఇంకా అలాగే కొన్నిసార్లు కొన్ని అవయవాలనుంచి రక్తస్రావం ఇంకా మనిషి శరీరం అంత నల్లగా మారిపోవడం , ఎక్కువగా నడవలేకపోవడం , కళ్ళు తిరిగి పడిపోవడం ఇంకా శరీరం శక్తి కోల్పోయి సన్నగా తయారవ్వడం లాంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి మనిషి కూడా క్యాన్సర్ బాధితుడు అని చెప్పలేము. వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన అసలు ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు.


కానీ ప్రాథమిక చికిత్సని తీసుకున్న తర్వాత కూడా, అదేపనిగా మీరు ఇబ్బంది పడుతుంటే మాత్రం ఒకసారి డాక్టర్‌చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేసుకొని చాలా నిశ్చింతగా ఉండాలి.ఇక క్యాన్సర్ వ్యాధి అనేది చాల రకాలుగానే వస్తుంది. రక్త పోటు, ఎముకల కాన్సర్,గొంతు క్యాన్సర్ ఇంకా అలాగే పేగు క్యాన్సర్ ఎలా చాల రకాల కాన్సర్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇక అదే ఆడ వారిలో అయితే ఇంకా కొన్ని గర్భాశయం కి సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు కూడా వాస్తు ఉంటాయి. ఇక వీటిలో , రొమ్ము క్యాన్సర్ , కడుపులో గడ్డలు లాంటివి చాలా ప్రమాదకరమైనవి. ఈ క్యాన్సర్ వ్యాధి రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఇక మనకు ఉన్న వేరే ఆరోగ్య సమస్యల వలన అవి క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. ఇంకా అలానే తీసుకునే ఆహరం , జీవించే వాతావరణం, ధూమపానం , మద్యపానం ఇంకా చెడు వ్యసనాలు కూడా ఈ క్యాన్సర్ వ్యాధి రావడానికి దోహదపడతాయి. ఇక కారణాలు ఏమైనా కానీ ఇది చాల ప్రమాదకరమైనది కాబట్టి త్వరగా చికిత్స తీసుకోవడం మంచిది లేకుంటే ప్రాణానికే చాలా ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: