ఈ మొక్క ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Purushottham Vinay
చెరువుల్లో, కుంటల్లో, వాగులలో, కాలువల్లో ఇంకా బావుల్లో అలాగే నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాలలో పెరిగే మొక్కలల్లో తూటి కూర మొక్క కూడా ఒకటి.ఇక ఈ మొక్క ఆకులతో పప్పును ఇంకా అలాగే పచ్చడిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ తూటికూర మొక్క కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను ఈజీగా నయం చేస్తూ ఉంటారు. తూటి కూర మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ మొక్కలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడే వారు ఎటువంటి మందులను మింగే పని లేకుండా కేవలం ఈ తూటి కూర మొక్క ఆకులను కూరగా, పప్పుగా ఇంకా పచ్చడిగా చేసుకుని తినడం వల్ల పుష్కలంగా ఐరన్ లభిస్తుంది.చాలా మంది గడ్డలు, వ్రణాలు ఇంకా సెగ గడ్డలు వంటి వాటితో బాధపడులూ ఉంటారు. అలాంటి వారికి తూటి కూర మొక్క ఖచ్చితంగా ఒక వరమనే చెప్పవచ్చు. తూటి కూర మొక్క ఆకులను ఉపయోగించి గడ్డలను ఇంకా వ్రణాలను తగ్గించుకోవచ్చు. తూటి కూర మొక్క ఆకులకు ఆముదాన్ని రాసి కొద్దిగా వేడి చేసి గడ్డలపై ఇంకా వ్రణాలపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా రెండు రోజుల పాటు చేయడం వల్ల గడ్డలు ఈజీగా తగ్గుతాయి.


ఈ మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల కళ్ల మంటలు, కంటి చూపు తగ్గడం, కంటి చూపు మందగించడం ఇంకా అలాగే కళ్ల నుండి నీరు కారడం వంటి కంటి సమస్యలు తగ్గుతాయి.ఇక అంతే కాకుండా తూటి కూర మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల శరీరంలో ఉండే మలినాలు ఈజీగా తొలగిపోతాయి. చర్మ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధిని ఈజీగా నియంత్రించే గుణం కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్క ఆకులను ఏ రూపంగా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి ఈజీగా నియంత్రించబడుతుంది. అంతే కాకుండా ఈ మొక్క ఆకులను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది. జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా అప్పుడప్పుడూ తూటి కూర మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల రోగాలు ఈజీగా నయం అవ్వడమే కాకుండా భవిష్యత్తులో రోగాల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: