లైఫ్ స్టైల్ :ఈ ఆహారాలు తింటే ఎముకలు దృఢంగా మారుతాయా..!!

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఎక్కువగా అనేక సమస్యలు వస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఎముకలలో నొప్పులు, ఇతర సమస్యలు రావడం మామూలే అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు చిన్న వయసులోనే ఈ సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఎముకల ఆరోగ్యం భవిష్యత్తులో మెరుగుపడాలంటే ఆరోగ్యం లో పలు మార్పులు చేసుకోవాలి. జీవనశైలి, నిద్ర, వ్యాయామం ఇలా ఎన్నో చేయడం వల్ల దీని ప్రభావం ఎముకల శక్తి పై ఆధారపడి ఉంటుంది. అప్పుడే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎముకలు దృఢం గా మార్చే కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవడం వల్ల.. సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి.. వల్ల ఎముకలు చాలా బలంగా మారతాయి. బాదం, పచ్చి ఆకు కూరలు, ఆలీవ్ నూనె, అరటిపండు, నువ్వులు సోయా పదార్ధాలు ఎముకలకు చాలా బలంగా చేస్తాయి.. అలాగే కొన్ని రకాల ధాన్యాల లో కూడా పైకి యాసిడ్ ఉండటం వల్ల ఇది క్యాల్షియం లక్షణాలను శరీరంలో తొలగిస్తుంది. ఇక మనకి దొరికేటటువంటి చికెన్ మటన్ వంటి అనేక జంతువుల ప్రొటీన్ల వల్ల.. మన శరీరంలో క్యాల్షియం బాగా తగ్గిస్తాయి. అందుచేతనే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
రెడీ టూ ఈట్ ఫుడ్ లో చాలా ఉప్పు ఉంటుంది ఇది శరీరం నుంచి కాల్షియం ను తొలగిస్తుంది అందువల్లనే.. మన శరీరంలో సోడియం తగిన మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. అతిగా మద్యం సేవించడం వల్ల.. బోలు ఎముకల వ్యాధి చాలా ప్రమాదంగా అవుతుంది. టీ, కాఫీ లభించే కెఫిన్ క్యాల్షియం లోపం ని తగ్గిస్తుంది.. ప్రతి రోజు కూడా కొన్ని వర్కవుట్లు, విటమిన్ డి-3  తీసుకోవడం వల్ల ఎముకలు చాలా బలంగా మారుతాయి. ఈ విధంగా చేయడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: