కొవ్వు కరిగి పొట్ట తగ్గాలంటే ఇవి తినాల్సిందే!

Purushottham Vinay
కొవ్వు కరిగి పొట్ట తగ్గాలంటే మెంతులు తీసుకోవాలి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. మెంతికూర, లేదా మెంతులు తీసుకోవడం ద్వారా మీరు చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని కూడా పొందుతారు. ఇవి ఆహార కోరికలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. మెంతికూర శరీరంలో జీవక్రియ రేటును కూడా బాగా పెంచుతుంది.అలాగే కొన్ని మెంతి గింజలను వేయించి గ్రైండ్ చేసి పౌడర్ చేయండి. ఈ పొడిని ఉదయం పూట ఖాళీ కడుపుతో నీటితో కలిపి తీసుకోవచ్చు. లేదా మెంతులను రాత్రిపూట నీటిలో కూడా నానబెట్టండి. ఆ తర్వాత ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. ఈ నీటిని తాగడంతోపాటు విత్తనాలను కూడా మీరు తినండి.ఇంకా అలాగే త్రిఫల చూర్ణం కూడా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని ఈజీగా బయటకు పంపుతుంది. త్రిఫల చూర్ణం రాత్రి భోజనం తర్వాత కనీసం రెండు గంటల తర్వాత ఇంకా అలాగే అల్పాహారానికి అరగంట ముందు వెచ్చని నీటిలో తీసుకోవాలి.


అలాగే పసుపును కూడా సాధారణంగా కూరలలో ఉపయోగిస్తారు. పసుపులో బరువు తగ్గించే గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది జీవక్రియను బాగా మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉండటంలో బాగా సహాయపడతాయి. అలాగే పసుపును పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు.అలాగే దాల్చిన చెక్క శరీరంలోని జీవక్రియ రేటును కూడా బాగా పెంచుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. ఒక కప్పు దాల్చిన చెక్క టీని ఉదయాన్నే తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.అలాగే నల్ల మిరియాలు పైపెరిన్ మూలకాన్ని కలిగి ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే జీవక్రియను కూడా వేగవంతం చేయడం కోసం బ్లాక్ పెప్పర్ టీ తాగడం మంచిది.కొవ్వు కరిగి పొట్ట తగ్గాలంటే ఇవి తినాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: