లైఫ్ లాంగ్ స్మోక్ చేసినా కొంతమందికి క్యాన్సర్ రాదు.ఎందుకు?

Purushottham Vinay
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో సిగరెట్‌ స్మోకింగ్ అనేది ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. అంతేకాదు యూఎస్‌లో దాదాపు 90 శాతం లంగ్ క్యాన్సర్ మరణాలకు పొగాకు ఉత్పత్తులే ఎక్కువ కారణమవుతున్నాయి.ఇక ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే పొగ తాగకపోవడమే చాలా సురక్షిత మార్గం. కానీ జీవితాంతం ధూమపానం చేసిన వారందరూ కూడా లంగ్ క్యాన్సర్‌ బారిన పడరనేది నిజం. దీనిపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా కూడా పరిశోధిస్తుండగా.. ఇక జెనెటికల్ ప్రభావం ఉంటుందనే ఆలోచనకు కొత్త అధ్యయనం బలాన్నిచ్చింది.ధూమపానం చేసినప్పటికీ కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడని వ్యక్తుల్లో పరిశోధకులు స్వాభావిక ప్రయోజనాన్ని కనుగొన్నారు. ఇక వారి ఊపిరితిత్తులను లైన్ చేసే కణాలు కాలక్రమేణా పరివర్తన చెందే అవకాశం కూడా తక్కువగా ఉందని తెలిపారు. కొంతమంది వ్యక్తుల్లో డీఎన్‌ఏ రిపేర్‌కు సంబంధించిన జన్యువులు అనేవి మరింత చురుగ్గా ఉంటాయని ఇంకా ఇవి క్రమం తప్పకుండా సిగరెట్లు తాగినప్పటికీ క్యాన్సర్స్ నుంచి రక్షించగలవని పరిశోధనలు అనేవి సూచిస్తున్నాయి. ఈ జన్యువులు వారసత్వంగా లేదా సహజంగా కూడా పొందవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.


ఈ అధ్యయనం 14 మంది నాన్ స్మోకర్స్ ఇంకా 19 మంది లైట్ ఇంకా నార్మల్ అండ్ హెవీ స్మోకర్స్ శ్వాసనాళాల నుంచి తీసుకున్న జన్యు ప్రొఫైల్స్‌ను పరిశీలించింది. ఇక ఆయా వ్యక్తుల ఊపిరితిత్తుల నుంచి సేకరించిన ఉపరితల కణాలు వారి జన్యువుల్లో ఉత్పరివర్తనాలను కొలిచేందుకు ఒక్కొక్కటిగా సీక్వెన్స్ ని చేశారు. 'ఈ ఊపిరితిత్తుల కణాలు సంవత్సరాలు ఇంకా దశాబ్దాల పాటు మనుగడ సాగిస్తాయి. అంటే ఇక వయసు పెరిగే కొద్దీ ధూమపానం కొనసాగించినపుడు ఉత్పరివర్తనలు(మ్యుటేషన్స్) పేరుకుపోతాయి' అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ఎపిడెమియాలజిస్ట్ అండ్ పల్మోనాలజిస్ట్ సైమన్ స్పివాక్ వివరించడం జరిగింది.అయితే డీఎన్‌ఏను రిపేర్ చేయడంలో ఒక వ్యక్తి శరీరాన్ని మెరుగ్గా మార్చేది ఇప్పటికీ కూడా పెద్ద మిస్టరీగానే ఉంది. అయినా కానీ ఈ అధ్యయనం ఫలితాల ఆధారంగా జీవితకాలం ధూమపానం చేసేవారిలో 80 నుంచి 90 శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేరనే విషయంలో ఇది ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: