72 ఏళ్ళ వయస్సులో బాడీ బిల్డింగ్ పోటీలకు.. ఫిట్నెస్ చూస్తే షాకే?

praveen
ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ కూడా వ్యాయామం చేసే టైం లేకుండా పోయింది. ముఖ్యంగా యువత శారీరక దృఢత్వాన్ని పట్టించుకోకుండా ఇక మనీ వెంట పరుగులు పెడుతున్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయ్. అయితే నేటి రోజుల్లో యూత్ యువత వ్యాయామం చేయడానికి ఆసక్తి కనబరచకుంటే.. ఇక్కడ 72 ఏళ్ళ వయసులో ఒక ముసలాయన మాత్రం వ్యాయామం పట్ల అతనికి ఉన్న అంకితభావానికి చూపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

 సాధారణంగా 72 ఏళ్ల వయసులో ఎవరైనాసరే కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చొని మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. వృద్ధాప్యంలో కుటుంబంతో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు 60 ఏళ్ల వయసు పైబడిన తర్వాత దాదాపు శరీరం ఏదైనా బరువు ఎత్తడానికి  అసలు సహకరించదు అని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక పెద్దాయన మాత్రం 60 ఏళ్లు కాదు ఏకంగా 72 ఏళ్ల వయసులో బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. తన ఫిట్నెస్  తో అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 తమిళనాడు చంగాల్పట్టు కు చెందిన రత్నం అనే 72 ఏళ్ల వ్యక్తి వృద్ధాప్య వయసులో కూడా శరీరాన్ని ఉక్కుల మార్చుకున్నాడు. యువకులతో పోటీపడటం కాదు అంతకు మించి కండలు పెంచుతు వున్నాడు. ఇక ఈ వయసులో బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలవాలని ఆశపడుతున్నాడు. ఇటీవల హిమాచల్ లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరై ఉత్తమ ప్రదర్శన చేశాడు. కాగా ఇక జూలై 15నుంచి 21 మధ్య మాల్దీవుల్లో జరగబోయే 54వ  ఆసియా బాడీ బిల్డింగ్ పోటీల్లో ఒక 60 ఏళ్ల వయసు పైబడిన ఈ విభాగంలో ఇక భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారను అంటూ చెబుతున్నాడు రత్నం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: