లైఫ్ స్టైల్: మహిళలు ఈ ఫుడ్ ఖచ్చితంగా తినాలి.. అప్పుడే ఈ వ్యాధులు రావు..!!

Divya
ప్రతి సంవత్సరం మే 28న అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. మహిళా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇది ముఖ్యమైన తేదీ గుర్తించడం జరిగింది. కుటుంబం, పిల్లల బాధ్యత, ఉద్యోగం వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీంతో చాలామంది వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉన్నది. ఈ పరిస్థితుల్లో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యము. ముఖ్యంగా డైట్ లో కొన్ని సూపర్ ఫుడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యం గా ఉండవచ్చు వాటి గురించి చూద్దాం.
1). సోయాబీన్:
మహిళలు ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి అంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే.. మీరు సోయా బీన్స్ ను  ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిలో విటమిన్ సి, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.
2). అవకాడో:
అవకాడో లో  విటమిన్లు,  ఖనిజాలు,  ఫైబర్ మరియు కొవ్వు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారించడంలో ఉపయోగపడుతుంది.
3). బీన్స్:
బీన్స్ లో ఎక్కువగా ప్రోటీన్,  ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. బీన్స్ మహిళల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. హార్మోన్ బ్యాలెన్స్ తో ఇబ్బంది పడేవారు వీటిని తినవచ్చు.
4). చేపలు:
నాన్ వెజ్ తినే మహిళలు తమ ఆహారంలో సాల్మన్, మాకేరేల్, సార్డ్ నేష్ వంటి చేపలను చేర్చుకోవడం వల్ల ఇందులో ఒమేగా త్రీ ఫ్యాట్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్లనొప్పులు,  పక్షవాతంతో బాధపడే వారికి మంచి ఉపశమనం పొందవచ్చు.
5). బెర్రీలు:
మనం ఆహారంలో బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీస్ వంటివి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు.. క్యాన్సర్ నిరోధక గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ , పెద్దపేగు క్యాన్సర్ నుంచి మహిళను రక్షించడంలో ఈ బెర్రీలు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ , విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: