లైఫ్ స్టైల్: భుజం నొప్పి తరచూ బాధిస్తోందా..?

Divya
ఇటీవల కాలంలో చాలామంది వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటికే పరిమితమై ఒకే ప్రదేశంలో కూర్చుని పనిచేయడం చాలా ప్రమాదకరంగా మారి పోయింది. ఎందుకంటే శరీరంలో ఏ భాగం కూడా కదలలేకపోగా రక్త సరఫరా కూడా నెమ్మదిగా జరుగుతుంది. అందుకే ఒళ్ళు నొప్పులు , నడుం నొప్పి , భుజం నొప్పి , మెడ నొప్పి అంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలామందికి భుజం నొప్పి మాత్రం పోవడం లేదు. పైగా తీవ్రంగా బాధిస్తోంది. ఇక భుజం నొప్పి తగ్గాలి అంటే కచ్చితంగా ఇలాంటి చిన్నచిన్న పద్ధతులు పాటించాల్సిందే.

ఐస్ థెరపీ చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఐస్ థెరపీ వల్ల భుజాల నొప్పిని ఎంతో సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో కొన్ని ఐస్ ముక్కలు వేసి భుజాలపై ఒక 10 నిమిషాల నుండి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మీ భుజం నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. పైగా భుజం నొప్పి వచ్చిన ప్రతి సారి మీరు ఈ చిట్కా పాటించవచ్చు.
ఇక ఒక గిన్నె తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు పసుపు , నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక ఈ మిశ్రమాన్ని భుజాలకు అప్లై చేసి పూర్తిగా ఎండిపోయే వరకు అలాగే ఉండాలి. ఇంకా వేడి నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక ప్రతి రోజూ ఉదయాన్నే మీరు ఈ చిట్కాలు పాటించి నట్లయితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
ఇక ఒక బకెట్ వేడి నీటిలో ఒక అర కప్పు ఎప్సోమ్ ఉప్పు వేసి బాగా కరిగించాలి. ఇప్పుడు నీళ్లతో స్నానం చేయాలి . ఇక ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఈ నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడడమే కాకుండా మరే ఇతర నొప్పులు అయినా సరే ఇట్టే దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: