
"పెళ్లి చూపులకు వెళుతున్నారా"... ఈ విషయం గుర్తించుకోండి ?
అయితే పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఎలా తన జీవితానికి కరెక్టా కాదా అన్నది తెలుసుకోవాలి అన్న విషయం గురించి ఈ విషయాలు తెలుసుకోండి. పెళ్లి కూతురు కేవలం అందంగా ఉంటే చాలు అని కళ్ళకు నచ్చితే చాలు ఇక పెళ్లి ఫిక్స్ అనుకుంటే పొరపాటే... స్త్రీ అందాన్ని చూసి తనతోనే జీవితం అని వివాహం నిశ్చయించుకోవడం పెద్ద పొరపాటే కావచ్చు అంటున్నారు. 100 ఏళ్ల వైవాహిక జీవితానికి... బాహ్య సౌందర్యం కంటే ఆమె సుగుణాలు చాలా ప్రదానం. అందం కంటే స్త్రీకి సంస్కృతి, విద్య ఉన్నతిని చేకూరుస్తాయి. అవే జీవితంలో ఎలా మెలగాలి, ఎలా జీవితం లోని మంచి చెడులను హ్యాండిల్ చెయ్యాలి అన్న జ్ఞానాన్ని అందిస్తాయి.
అలాగే పెళ్లి గురించి తెలుస్తున్న వివరాల ప్రకారం పురుషుడితో పాటు స్త్రీకి కూడా మతపరమైన ఆచారాలపై పూర్తి విశ్వాసం ఉండాలి. పెళ్లి చూపులకు అమ్మాయిని చూసేందుకు అబ్బాయి వెళ్ళినపుడు, ఆ పెళ్లి కూతురు మతపరమైన నమ్మకాలను కలిగి వుందో లేదో అన్న విషయాన్ని గ్రహించాలి. అలాగే ఆమె గుణగణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అపుడే ఆమె మీ జీవితానికి సరిపోతుందా లేదా అన్నది ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతే కానీ పైకి కనిపించే అందాలకు లోను కాకూడదు అని తెలుస్తోంది.