లైఫ్ స్టైల్: ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Divya
మనకి బాగా దొరికే అటువంటి వాటిలో కొబ్బరికాయ కూడా ఒకటి.. ఇది మనకి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగపడుతూనే ఉన్నది. కొబ్బరికాయలో ఉండే సైటోకినిన్స్ వల్ల మనకి వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఫాస్ట్ వర్క్ ఔట్ డ్రింకు గా కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటివి చాలా ఉంటాయి.

మరీ ముఖ్యంగా విటమిన్ -E చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇది ఉండటం వల్ల చర్మం పై ముడతలు వంటివి కనిపించవు. ఇవి మన రోగనిరోధక శక్తిని కాపాడుతూనే ఉంటాయి. కొన్ని అంటు వ్యాధుల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. కొబ్బరి నీళ్ళలో కొన్ని పోషకాలు బాగా లభించడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణను పెంచి.. రక్తపోటును నియంత్రిస్తుంది. అందువలన ఈ సమస్య వుండేవారు కొబ్బరి నీటిని తప్పకుండా తాగడం మంచిది. కేవలం కొబ్బరి నీళ్లలో 5% తప్ప మిగతా అంతా నీరు మాత్రమే ఉంటుంది.. అందుచేత దీన్ని తాగిన వెంటనే కొన్ని గంటల పాటు నీటి కొరత అనేది ఉండదు.

ఇతర పోషకాలతో పాటు గా కొబ్బరి నీళ్ళలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించి.. జీర్ణవ్యవస్థను చాలా బలపరుస్తుంది. ఇక అంతే కాకుండా మన శరీరంలో ఉండే పేగులు కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక మన శరీరంలో ఉండే ph విలువలను సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఈ కొబ్బరి నీళ్లు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఈ నీళ్ల ని తరచూ తాగడం వల్ల నాడీ వ్యవస్థ బాగా పని చేయడంతో పాటు కీళ్లనొప్పుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అందుచేతనే ఉదయంపూట ఈ నీటిని ఎక్కువగా తాగండి అంటూ వైద్యులు సలహా ఇస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: