మన కంటికి ఆహ్లాదకరంగా ఉండే ఏ కొత్త వస్తువైన , వాహనలైన మొదలైనవి చూసేందుకు ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అలాగే సామాన్యుడు దూర ప్రయాణం చేసే రవాణా వ్యవస్థ రైల్వే లో మరింతమంది ప్రయాణికులను ఆకర్షించేందుకు సైతం కొత్త కొత్త సొబబులు దిద్దేందుకుంటూ వస్తుంది. అందుకే ఇప్పుడు రైళ్లకు సైతం నూతన సింగారాలు మొదలుపెడుతున్నారు.
ఇలా రైళ్లకు నూతన సింగారాలు అద్దడంతో చూపరులకు అవి ఏంతో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా చూడముచ్చటగా ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో నడుస్తున్న రైళ్లకు పలు ప్రాంతాలకు చెందిన రకరకాల చిత్ర కళలు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రాచీన చిత్ర కళలకు కణాచి గా నిలిచే పూర్వంచల్ ప్రాంతంలో నడిచే రైళ్లకు అక్కడి చిత్ర కళ్లల్లో
అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన మధుబని చిత్ర కళ ను ప్రముఖంగా రైళ్లకు వేస్తున్నారు.
బీహార్, ఉత్తరప్రదేశ్ ల నుంచి
ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లకు మాధుబని చిత్ర కళను చిత్రిస్తున్నారు. మాములుగా నీలి రంగు లో ఉండే రైళ్లు ను చూడటానికి అలవాటు పడిన సగటు రైల్వే ప్రయాణికులకు ఈ కొంగొత్త అందాలతో ముస్తాబైన రైళ్లను చూసి ఆశ్చర్యానికి గురి కావడంతో పాటుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైళ్ల కోచ్ కు వెలుపల వేసే ఈ పెయింటింగ్ ను మిథిల ఆర్ట్ వర్క్ అని అంటారు. పైగా ఈ పెయింటింగ్ వేసేందుకు మధుబనికి చెందిన
స్థానిక మహిళలకు రైల్వే అధికారులు అవకాశం కల్పించారు. ఒక్కో కోచ్ కు 30 మంది మహిళలు వేస్తే ఒక రైలుకు వేసేందుకు 4 రోజులు పట్టింది. ఈ రైళ్లలో 9 కోచ్ లు ఉంటాయి. ఒక్కో కోచ్ కు భిన్నమైన పెయింటింగ్స్ వేశారు.
అంతేకాకుండా ఒకప్పుడు
బీహార్ లోని పరమ చెత్తగా అపరిశుభ్రంగా ఉండే ప్రధాన రైల్వే స్టేషన్లలో మధుబని రైల్వే స్టేషన్ ఒకటి కానీ అక్కడి
స్థానిక అధికారులు మరియు ఆ స్టేషన్ ఉన్న సంస్థాన్ పూర్ డివిజన్ అధికారులు పూనుకొని కనుమరుగయ్యే స్థితిలో ఉన్న మధుబని చిత్రకళకు ప్రోత్సాహం అందించేందుకు స్టేషన్ మొత్తం ఆ పెయింటింగ్స్ వేసేందుకు ముఖ్యంగా అక్కడి
స్థానిక మహిళలకు అవకాశం కల్పించారు.
తమకి దక్కిన ఆ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న అక్కడి మహిళా చిత్రకారులు తమ చిత్ర కళా నైపుణ్యం తో స్టేషన్ ను ఏంతో అందంగా తీర్చిదిద్దారు.
అఖిల భారత రైల్వే స్టేషన్ల సుందరికరణ పోటీలో మధుబని రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం తో అక్కడి అధికారులు రైళ్లకు మరియు
బీహార్ లోని మరి కొన్ని స్టేషన్లకు సైతం మధుబని పెయింటింగ్స్ వేసే అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న రైళ్లకు మధుబనితో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన
స్థానిక చిత్రాల పెయింటింగ్స్ వేసేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.