లైఫ్ స్టైల్: వేరుశనగ విత్తనాలను అలా వేయించి తింటే.. లాభాలు ఎన్నో..?
ఇసకలో కాల్చుకునే పద్ధతి భారతీయ వంటకాలలో చాలా పురాతనమైనది గా ఉన్నది..ఇలాంటివి ఎక్కువగా బయట పరిసరాలలోని మనం చూస్తూ ఉంటాము. కాస్త మంచి ఇసుకను తీసుకొని అవసరమైన వాటిని వేయించి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు తెలియజేయడం జరుగుతుంది. ఇసకలో వేయించి చిరుధాన్యాలను తినడం వల్ల అవి ఎప్పుడూ కరకరలాడుతూ ఉంటాయి.అంతే కాకుండా ఈ పదార్థాలు టేస్టీ గా కూడా మారుతాయి.. మంచి రంగు, టేస్ట్ కూడా బాగా లభిస్తాయి.. ముఖ్యంగా ఇసకల్లో వేయించడం వల్ల.. అందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు చాలా పుష్కలంగా లభించడంతో పాటు జీర్ణం కూడా అవుతాయట. పాలిష్ చేయబడిన ఆహార ధాన్యాల కంటే ఇవి చాలా మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా ఇసుకలో బియ్యం, సెనగలు, వేరుశెనగలు వేయించుకోవచ్చు.. ఇసుకలో పోసి వీటన్నిటినీ బాగా వేయించి పొడి జల్లెడ పట్టడం వల్ల.. అందులో కాస్త మసాలాలు పట్టించి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయట. ఇసుకలో వేయించేది అనే పద్ధతి చాలా చౌకైన పద్ధతి.. ఇలా చేయడం వల్ల వీటిలో నూనె పదార్ధం భారీగా తగ్గి పోతుంది. దీంతో శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల గింజల్లో ఉండే సూక్ష్మ కణాలు మనం ఏ విధంగా చేసినా కూడా ఉండవని కొంతమంది నిపుణులు అధ్యయనంలో తెలియజేశారు.
.