మనం సంపాదిస్తున్న సొమ్ములో కొంత చిట్టిల రూపంలో కడుతుంటాం..! మరి ఆ చిట్టీలు కడితే లాభమా నష్టమా.. అనేది మనకు తెలియాల్సిన విషయం..?
మనము ఒక లక్ష రూపాయల చిట్టి వేసినప్పుడు వాటికి పాట పాడతారు. ఇందులో ముఖ్యంగా ప్రతినెలా పాడిన పాటలో చిట్టీలు వేస్తున్నవారు వారి అవసరాన్ని బట్టి 65 వేల నుంచి చిట్టి లను తీసుకుంటారు. అదే మొదటిసారి తీసుకున్నవారికి 60 నుంచి 65 వేలు తీసుకున్నా కానీ వాటిని చివరి వరకు కట్టాలి. అయితే ఈ మధ్యలో తీసుకున్న 65 వేల నుంచి వన్ లాక్ నిండే వరకు కట్టాలి.
కానీ ఆ అమౌంటు తీసుకున్నప్పటి నుంచి వన్ లాక్ నిండేవరకు కడితే వాటీ వడ్డీ డబ్బులు అన్నీ అవుతాయా..అనేది మనం తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం. అవసరాలకు చిట్టీలు పెద్దపెద్ద అమౌంటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు. అయితే ఈ చిట్టీలు వేసేటప్పుడు నాకు దగ్గరగా తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర, స్నేహితుల మధ్యలో లేదా బాగా గుర్తింపు పొందినటువంటి సంస్థలో మనం సేఫ్ గా చిట్టీలు వేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద అమౌంట్ లు వేసినప్పుడు కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు సడన్ గా బోర్డు తిప్పివేయడం లాంటివి చేసినప్పుడు మనం నష్ట పోవాల్సిందే. ముఖ్యంగా భర్తకు తెలియకుండా భార్యలు, భార్యకు తెలియకుండా భర్తలు సపరేట్ గా చిట్టి వేసే పరిస్థితులు ప్రస్తుత కాలంలో నడుస్తున్నాయి. ఈ విషయం ఎంత బాధాకరం అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఇలా పోగు చేయడం అనేది రిస్కు చేసినట్టే అని చెప్పవచ్చు. కానీ కొంతమంది పిల్లల కోసమో కుటుంబం కోసమో ఒకరికి తెలియకుండా ఒకరు సేవ్ చేస్తూ ఉంటారు.
ఈ సందర్భంలో ఏదైనా జరగరానిది జరిగితే ఆ భారం అనేది, ఆ బాధ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటప్పుడు ఎవరికి తెలియకుండా కూడా చిట్టీలు వెయకండి. ముఖ్యంగా చిట్టిల విషయంలో మనం కట్టే డబ్బులు, వచ్చే డబ్బు మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ముందే చిట్టి పాట పాడి తీసుకుంటే ఆ తీసుకున్న డబ్బు మన ఇంట్రెస్ట్ కట్టే దాని కంటే ఎక్కువగా యూజ్ అయిందా లేదా అనేది చూడాలి. ఏదో పనికిరాని పనులకు డబ్బులు తీసుకొని మళ్లీ అంత ఇంట్రెస్ట్ కట్టడం అనేది మనం నష్టపోవడానికి దారితీయవచ్చు.