పాల ధారల వెల్లువల్లో ఓ బాధ్యత
ఓ తార వెలుగు ఓ సంస్థకు అందించి
వెళ్లిన తీరు.. కన్నడ నాట ఓ అపురూపం
ఆ అపురూప రూపం ఇప్పుడొక పాల ప్యాకెట్ పై
ముద్రితం.. ప్రేమ ముద్రితం.. ఆనందం అముద్రితం..
జయహో కన్నడ కంఠీరవ జయహో పునీత్ రాజకుమార
25 లక్షల కుటుంబాలకు అన్నం పెట్టే అతి పెద్ద సంస్థ కు తనవంతు బాధ్యతగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పునీత్ రాజ్ కుమార్ ప్రచారకర్తగా ఉండి,ఆ సంస్థకు పెద్ద దిక్కై నిలిచి మన్ననలు అందుకున్నారు.ఇవాళ ఆ సంస్థ నిలదొక్కుకోవడంలో ఆయ నే కాదు పునీత్ రాజ్ కుమార్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పాత్ర కూడా ఎంతో కీలకం.ఆయన కూడా ఈ సంస్థకు ప్రచార కర్త కావడం విశేషం.సహకార రంగంలో ఓ సంస్థ నిలదొక్కుకుంటే ఎందరి జీవితాలకో భరోసా దక్కుతుందన్న నమ్మకంతో ఆ తండ్రీ కొడుకులు తమ ఉన్నతికి పరోక్షంగానూ ప్రత్యక్ష రీతిలోనూ సాయం చేయడం మరువలేమని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నా రు.
కన్నడ నాట ఎన్నో మంచి కార్యక్రమాలకు అండగా నిలిచిన రాజ్ కుమార్ కుటుంబం ఓ డెయిరీకి కొత్త జీవితం ఇవ్వాలని తలపిం చింది.అనుకున్నదే తడవుగా సహకార రంగంలో 1970ల కాలం నుంచి నడుస్తున్న ఫేమస్ డెయిరీ నందినీ డెయిరీ ఫాంకు అండ గా నిలిచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నడ కంఠీర బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అటుపై ఆయన బిడ్డ పునీత్ రాజ్ కుమార్ (ఇటీవల కన్ను మూశారు) కూడా నాన్న చూపిన బాటలోనే ప్రయాణించి అదే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిం చి,ఆ సంస్థ ఆర్థిక పురోగతిలో భాగం అయ్యారు. సహకారరంగంలో నడిచే ఇటువంటి సంస్థ తోడ్పాటుకు తామెంతో సహకరిస్తామ ని చెప్పారు. ఆనాటి మాటలకు గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఆ సంస్థ అడిషనల్ డైరెక్టర్ కె.రాజ్ కుమార్. ఒకనాటి ఈ సంస్థ నిర్వాహకులు అయినటువంటి ఏఎస్ ప్రేమ్‌నాథ్ తో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. ఆ బంధానికి కొనసాగింపుగా పునీత్ రాజ్ కుమార్ కూడా తండ్రి అడుగు జాడల్లో నడిచి ఎన్నో సందర్భాల్లో ఆ సంస్థ ప్రగతికి ప్రచారకర్తగా ఉంటూ సంస్థ ఎదుగుదల కు దోహదాకారిగా నిలిచారు.
దాతృత్వంలోనే కాదు ఇతరుల ఉన్నతికి కూడా ఎంతో సహకరించే మంచి మనసు ఆయనదేనని చె బుతూ,నివాళి ఇస్తూ..కన్నడ పవర్ స్టార్ ను గుర్తు చేసుకుంటూ,తమ కంపెనీ పాల ప్యాకెట్లపై ఆయన ముఖచిత్రం ముద్రించామ ని నందిని డెయిరీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు ఎన్నో సేవా కార్యక్రమాలకు అండగా ఉన్న వైనం తమను ఇప్పటి కీ కదిలిస్తుందని, ఆయన స్ఫూర్తి కొనసాగిస్తూ తోచిన రీతిలో భవిష్యత్ లో మంచికి చేయూత ఇచ్చే కార్యక్రమాలు చేపడతామని రా జ్ కుమార్ చెప్పారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇవాళ తమ సంస్థ నిలదొక్కుకుందంటే అందుకు పునీత్ రాజ్ కుమార్ లాంటి వ ర్థమాన తార సాయం కూడా ఓ గొప్ప విజయానికి సహకారం అయిందని చెబుతూ, ఆ ధ్రువ తార వెలుగుల్లో ఆ నవ్వుల్లో, వెన్నె ల్లో, తమ సంస్థ అందించే పాల ధారల వెల్లువల్లో ఎన్నటికీ ఆయన ఉండాలని..ఉంటారని చెప్పారు.
- రత్నకిశోర్ శంభుమహంతి