మార్నింగ్ రాగా : ఇంటెలిజెన్స్ స్పీక్స్ వెల్ బట్ క్యారెక్టర్ డిసైడ్స్ ఆల్ !

RATNA KISHORE
వైల్ క్యారెక్ట‌ర్ మేక్స్
వండ‌ర్స్
వైల్ నాలెడ్జ్ మేక్స్
వ‌ర్షిప్
వ‌ర్షిప్ అండ్ వండ‌ర్
ఆర్ బోత్ అన్ డిపెండ‌బుల్
ఫ‌ర్ మి...
మేక్ ఎ క్యాలెండ‌ర్
మేడ్ ఎ  డే..
ఎట‌ర్న‌ల్ ట్రూత్ విల్ నాట్ ఫాలో అజ్

నేను నేనే..నువ్వెందుకిక్క‌డ‌? నా పేరుపై పేటెంట్ నీకుందా? ఒక‌రి లైఫ్ మ‌రొక‌రికి భారం అయిన‌ప్పుడు ఒక‌రికొక‌రు అనుకోవ‌డం త‌ప్పు. సో.. క్వ‌శ్చ‌నే రాంగ్‌. నేను నీ కోసం నువ్వు నాకోసం ఇదంతా రాద్ధాంతం. వాన కొద్ది కొద్దిగా అక్క‌డ‌.. ఎండ అటుగా ఇంకొంచెం ఏట‌వాలుగా అక్క‌డ‌..ఎండావాన‌ ఒకేసారి ఇంకోచోట‌.వేళ కాని వేళ వానొద్దు.మితిమీరిన ఎండ అస‌లొద్దు.అలానే విప‌రీతం అనుకున్న‌దేదీ వ‌ద్దు.ఏది ఎంతవ‌ర‌కో అంత‌వ‌ర‌కే..నువ్వూ అండ్ నీ న‌వ్వూ కూడా..!తెలివి జ్ఞానం అన్న‌వి విరుద్ధంగా ఉండ‌డం లేదు..స‌ముపార్జించినవ‌న్నీ విరుద్ధాలు అయితే బాగుంటుంది.. దేనితోనూ కుద‌ర‌ని అంగీకారం  కూడా ఓ ఆనంద‌మే!

వీలున్నంత వ‌ర‌కూ మ‌నిషి చేసే ప్ర‌తిపాద‌న‌ల‌కు కాలం అంగీకారం ఒకంత‌ట ఉండ‌కూడ‌దు..కొత్త‌వేమ‌యినా ఆలోచించేందుకు కాలం ఇచ్చే  ఒక ప‌రిష్కారం అంత వేగంగా చిక్కి ఉండకూడ‌దు..ల‌భ్య‌త అన్న‌ది కొన్ని సార్లు లోకువ‌యి ఉంటుంది. లొంగి ఉండి ఉండడంలో ఏ అర్థం లేదు. కాలం మ‌రియు మ‌నిషి చేసే తిరుగు బాటు రెండూ కూడా అర్థ సంబంధాలు అయి ఉంటాయి. కాక‌పోయినా ప‌ర్లేదు..కొత్త అన‌ర్థాల‌కు దారులు వెతికే స‌మ‌యం ఇంకా ఉంది..వేచి ఉండండి.

యుద్ధ కాలాలు యుద్ధ మేఘాల ఆలాప‌న‌లు మోహ‌పు దారులు అన్నీ ఉంటాయి..దేహాల యుద్ధాల చెంత క‌రిగిన రాత్రి ఇచ్చిన విషాదం ఇంకా ఉద‌యాల చెంత నిక్షిప్త ప్ర‌భావ‌మే! ఉద‌యం ఎలా ఉంటుంది అన్న నిర్వ‌చ‌నంలో తాజా కూర‌గాయల ధ‌ర‌లు న‌వ్వి న‌వ్వి వెళ్తాయి..జీవితం అక్క‌డి నుంచి ప్రారంభం..ఆమె చెప్పిన విధంగా ప్రారంభం..క‌నుక మ‌గాడి తెలివి మ‌గువ ద‌గ్గర చెల్లుతుందా.. ఆఫీసుకు వెళ్తూ వెళ్తూ అమ్మ‌డి ద‌గ్గ‌ర పొందే పెద‌వి సంత‌కం ద‌గ్గ‌ర మ‌గాడి తెలివి దారి త‌ప్పి పోతుంది. క‌నుక మ‌నిషి కొన్ని బ‌ల‌హీన‌త‌ల ద‌గ్గ‌ర ఉనికిని కోల్పోతాడు. బ‌ల‌మ‌యిన ఆలోచ‌న‌ల ద‌గ్గ‌ర యుద్ధం చేసి అల‌సి సొల‌సి ఇంటికి చేరిపోతాడు. క‌నుక మ‌నుషుల్లో విభిన్న వాదాలు ఉంటాయి కానీ విభిన్న‌త‌కు నోచుకునేంత ప‌నులు మాత్రం అతి త‌క్కువ‌గానే ఉంటాయి.

రొటీన్ రొటీన్ రొటీన్.. మారాలి మారాలి మారాలి అని ఓ సినిమాలో దిగ్గజ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ చెబుతుంటారు..న‌వ్వుకున్నాను..
ఎవ‌రు మారాలి..ఎందుకు మారాలి..మ‌నం మారాలి అనుకున్నంత తెలివి మ‌న‌కు భ‌గ‌వంతుడు ఎందుకు ఇవ్వ‌డం లేదు.
లోకాన్ని మార్చే తెలివి మ‌నిషి ఎందుకని పొంద‌డం లేదు..ఒక అసందిగ్ధ ధోర‌ణి నుంచి మ‌నం విడిపోయి వెళ్ల‌డం ఒక ఇబ్బంది.
స‌మ‌స్య అన్న‌ది తెలివికి స‌వాలుగా నిలిచిన ప్ర‌తిసారీ నాయ‌కులకు ప్ర‌జ‌లు చిన్న‌వాళ్లుగా క‌నిపిస్తారా? అబ‌ద్ధాలు చెప్పే వాళ్ల‌లో కూడా ఆ చెప్పేరీతిలో ఏదో ఒక నిజాయితీ నిక్షిప్తం అయి ఉంటుంది..ఎప్పుడూ త‌ప్పు ఒప్పుకోని వారికి దుఃఖం వెన్నాడే ఉంటుంది. ప్రాయిశ్చిత్తం అవ‌స‌రం అయి ఉంటుంది. క‌నుక కాలం మిగిల్చిన అప‌రాధ భావం ఒక‌టి లోప‌ల కీడును వెల్ల‌డిలోకి తెస్తుంది.

తెలివికి అర్థం, ప‌ర్యాయ ప‌దం వెతికి వెతికి విసిగిన చోటు దొర‌క‌లేదు..తెలివికి ఒక ప్ర‌త్య‌యం వెత‌కాలి అని  అనుకుంటూ పూర్వ ప్ర‌త్య‌యం, ప‌ర ప్ర‌త్య‌యం ఏదీ కూడా ప్ర‌త్యూష కాలాల చెంత దొర‌క‌లేదు.. ఏడాది వెళ్తూ వెళ్తూ..కొన్ని మిగిల్చి వెళ్తుంది..వెళ్తూ వెళ్తూ కొన్ని కానుక‌లు ఇచ్చి వెళ్తుంది. కాలం ఇచ్చిన వాటిలో ఉన్న‌వన్నీ మేలు అని అనుకోవ‌డ‌మే భ్ర‌మ.. మ‌నుషుల్లో ఉన్న‌వ‌న్నీ మేలు త‌ల‌పులు మేలుకొలుపులు అని అనుకోవ‌డం ఓ పెద్ద అబ‌ద్ధం. అబ‌ద్ధాన్ని తెలివితో ర‌ద్దు చేయ‌డం సులువు. అబ‌ద్ధాన్ని తెలివితో నిరూప‌ణ చేయ‌డం క‌ష్టం. మ‌నకు జీవితం కొన్ని అబ‌ద్ధాల‌ను అసందిగ్ధతల‌ను ఇస్తుంది. జ్ఞానాన్ని విసిరి కొడితే ఇప్ప‌టి తెలివి అడ‌వికి ఇచ్చి వెళ్తే ఏమ‌యినా ఈ ప్ర‌కృతి కానీ మ‌నిషి కానీ ప‌రిర‌క్ష‌ణ‌కు నోచుకుని ఉంటారా? అన్న‌దే లోప‌లి ప్ర‌శ్న. క్యారెక్టర్ విల్ డిసైడ్స్ ఆల్....

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: