లైఫ్ స్టైల్ : లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ వస్తువులు తప్పనిసరి..!!

Divya
లక్ష్మీదేవి అన్నింటికీ మూలకారణం కాబట్టి అలాంటి మహాలక్ష్మిదేవిని మనం ప్రసన్నం చేయాలి అంటే కొన్ని జాగ్రత్తలతో పాటు ఆమెకు నచ్చిన వస్తువులను కూడా ఇంట్లో ఉంచితే తప్పకుండా ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కనుక మనం పొందాలి అనుకుంటే ఈ పనులు తప్పకుండా చేయాలట. ముఖ్యంగా ప్రపంచంలో కష్టం లేని మనిషంటూ ఎక్కడ ఎవరు ఉండరేమో అయితే ఈ కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా ధైర్యంగా ఆ కష్టాన్ని ఎలా దూరం చేసుకోవాలి అనే విషయంపై పెడితే తప్పకుండా విజయం మనదే అవుతుంది.
నీకు విపరీతంగా డబ్బు రావాలి అంటే ఈ ఎనిమిది రకాల వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయో లేదో గమనించాలి. మొదటిది ఓంకారం.. హిందూ సాంప్రదాయం కట్టడం ఓంకారం గుర్తు ఉండే విగ్రహాన్ని  పెట్టుకొని ప్రతిరోజు పూజించడంవల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. అంతవరకు ఓంకారం గుర్తు ఉండే విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిరోజు పూజ చేయడం అలవాటు చేసుకోండి.
పూర్ణకుంభం.. పూర్ణకుంభం కూడా ఇంటిలో ఉండడం వల్ల ఇంటి చుట్టూ ఇంటి లోపల పాజిటివ్ ఎనర్జీ వెలువడుతుంది. ముఖ్యంగా పూర్ణకుంభం ఏర్పాటు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా శుభకార్యాలు పెళ్లి వేడుకలలో ఈ పూర్ణకుంభం ఉంచడం తప్పనిసరి. నీటిలో ఉండే తాబేలు. ఒక ప్లేటు తీసుకుని అందులో నీళ్లు పోసి తాబేలు విగ్రహాన్ని పెట్టడం వల్ల మంచి శుభ పరిణామాలు ఎదురవుతాయి. గోల్డ్ ఫిష్ ను కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటి చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా మారుతుంది.. డబ్బులు కూడా ఎక్కువగా వస్తాయి. ఇక గాలి గంటలు, స్వస్తిక్ గుర్తులు ఇలాంటివి కూడా ఇంట్లో ఉంచడం వల్ల డబ్బు అధికంగా వస్తుంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకూ వీటిని మీ ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: