లైఫ్ స్టైల్:ఈ క్రిస్మస్..కి ఇంటిని అందంగా మార్చే టిప్స్..!

Divya
డిసెంబర్ 25న కొంతమంది క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజున తమ ఇంటికి వచ్చిన కొంతమంది అతిథులకు విభిన్న రీతిలో స్వాగతం పలుకుతూ ఉంటారు. అయితే అతిథులను అట్రాక్షన్ చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఉపయోగించడం వల్ల, మీ ఇల్లు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం.
1).ముందుగా మీ ఇంటి గుమ్మం ముందర.. ఒక బెంచ్ పైన కొవ్వొత్తులను ఉంచి వచ్చే అతిథులకు వెల్ కం వంటి సందేశాన్ని ఉండేలా చూసుకోవాలి.
2). ఈ సంవత్సరం లో జరిగే చివరి పండుగ, పెద్ద పండుగ కాబట్టి.. ఈ పండుగను చేసుకునేవారు ఒక క్రిస్మస్ ట్రీ ని తెచ్చుకోవడం చాలా మంచిది. ఆ క్రిస్మస్ చెట్టుకు.. కొన్ని కలర్ రిబ్బన్ బహుమతులను అతికించి ఉంచాలి.
3). బెలూన్స్ లేకుండా ఇంటి లోపల అట్రాక్షన్ కనిపించదు కాబట్టి.. వాటిని అక్కడ అక్కడ గాలి ఊది అతికించడం మంచిది.
4). ఇక ఇంటికి వచ్చిన గెస్ట్ లకు ఏదో ఒక చిన్న బహుమతి ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే.. వారు చాలా సంతోషం తో పాటు మిమ్మల్ని కూడా ఆనందంగా ఉండేలా కోరుకుంటారు.
5). ఒకవేళ మీ ఇంట్లో హోమ్ సెల్పులు ఉన్నట్లయితే.. వాటిని గ్రీన్ గ్లాస్ తో లేదా, పూల వస్తువులతో అలంకరించడం మంచిది. మరి ఏదైనా కొత్తదనం గా అనిపిస్తే చేయడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది.
6). ముఖ్యంగా కొవ్వొత్తుల ను వాడేటప్పుడు ఆరోమా థెరఫీ కొవ్వొత్తులనే ఉపయోగించడం చాలా మంచిదట.
7). ఇక అతిథులంతా వచ్చింది భోజనం చేసే సమయంలో డైనింగ్ టేబుల్ అలంకరించడం చాలా ముఖ్యము. అక్కడి పదార్థాలను బాగా ఆకర్షించాలంటే అక్కడ ఒక క్రిస్మస్ ట్రీ చిన్నది ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. వాటి మీద చిన్న చిన్న అలంకరణ దండలు వేయడం, బహుమతి కార్డ్ ను కూడా అక్కడ సెట్ చేయడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: