లైఫ్ స్టైల్: అన్నం తినే ముందు నీళ్లు తాగుతున్నారా..?
ఇకపోతే అందరికీ ఉన్న సమస్య ఏమిటంటే.. నీళ్ళను ఎక్కువగా తాగకపోవడమే.. చాలామంది నీళ్లను ప్రతిసారి తాగాలి అనుకున్నప్పుడు ఏదో కారణాలచేత నీళ్లు తాగలేక పోతున్నాను అని వాపోతున్నారు. అయితే శరీరానికి సరిపడా నీటిని అందించలేకపోతున్నారు.. అప్పుడు తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక పోతే ఈ రోజు నీళ్ల కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అందరూ చెప్పే మాటే అయినా తప్పకుండా శరీరానికి సరిపడా నీటిని తాగాలి. ఎప్పుడైతే తగినన్ని నీళ్లు తాగుతారో అప్పుడు శరీరంలో ఉండే చెడు పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.. అంతేకాదు పోషకపదార్థాలను క్యారీ చేయడానికి ఆక్సిజన్ ను అవయవాలకు అందించడానికి కూడా ఈ నీళ్లు చాలా ఉపయోగపడతాయి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా, ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడుతాయి.. పెద్దవాళ్ళు చెబుతున్న ప్రకారం ఏమిటంటే నిలబడి నీళ్లు తాగకూడదు అని.. నిలబడి నీళ్ళు తాగడం వల్ల ఆ నీళ్లు నెమ్మదిగా కొలెన్ దగ్గరికి చేరిపోతాయి.. కాబట్టి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే కూర్చుని నెమ్మదిగా నీళ్లు తాగడం వల్ల అన్ని శరీర భాగాలకు నీటి సరఫరా జరుగుతుంది.
భోజనం చేసేటప్పుడు కూడా మధ్యలో నీళ్లు తాగకూడదు.. ఎందుకంటే ఈ నీటిని తాగడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇక ఆహారం తీసుకోలేం కాబట్టి భోజనం చేసే సమయంలో నీటిని తీసుకోకూడదు.