లైఫ్ స్టైల్: వంటింట్లో దొరికే మెంతులతో అసలైన ప్రయోజనాలు..!!
ముఖ్యంగా ఎవరైతే బరువు తగ్గాలని లేదా పెరగాలని ఆలోచిస్తున్నారో అలాంటివారికి ఈ మెంతులు రెండు రకాలుగా కూడా ఉపయోగపడతాయట. అధిక బరువును తగ్గించుకోవాలి అనుకునేవారు ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఈ మెంతులు చేర్చుకోవడం వల్ల బరువు తగ్గిపోతారు. ఈ మెంతులు ప్రతిరోజు మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అరుగుదల కూడా మెరుగుపడుతుంది. మెంతులు అన్నిరకాల జీర్ణ సంబంధ సమస్యలతో పోరాడతానని మనకు తెలిసిన విషయమే.
చిన్న పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు వారికి నాలుగు గింజలు మెంతులను తినమని చెప్పండి.. వెంటనే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక ఈ మెంతులలో యాంటిఆక్సిడెంట్స్.. ఫైబర్ కూడా ఉండడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. ఇక శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి మెంతులు బాగా సహాయపడుతాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ మీద ఎలాంటి ప్రభావం చూపించవు ఈ మెంతులు.
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు మెంతులను తప్పకుండా ప్రతి రోజు తినడం వల్ల వీటిలో ఉండే ఎమైనో యాసిడ్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్లో సహాయపడతాయి. పీరియడ్స్ సమస్యల్లో మహిళలకు ఏర్పడే అసౌకర్యాన్ని పోగొట్టడంలో ఇది బాగా హెల్ప్ చేస్తాయి. నొప్పిని కూడా తగ్గిస్తాయి. కిడ్నీల ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి కూడా చక్కగా సహాయపడతాయి.