ప్రస్తుతం మార్కెట్లోకి ప్రతి వస్తువు రకరకాల డిజైన్లలో ఆకట్టుకునే విధంగా వస్తున్నాయి. ఒకప్పుడు అమ్మాయిలకు దుస్తుల డిజైన్లు అంటే ఒకటి, రెండు రకాలు మాత్రమే ఉండేవి, కానీ ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు అనేక డిజైన్లు వచ్చేసాయి. లోదుస్తుల నుండి మొదలు గోల్డెన్ చైన్ ల వరకు కొన్ని వేల రకాల డిజైన్లు మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి ఒక లోదుస్తువు డిజైన్ గురించి తెలుసుకుందాం..!
అమ్మాయిలు తమ అండర్ వేర్స్ లో ఒక పాకెట్ చూసే ఉంటారు.లేయర్ గా కుట్టబడి ఉన్న పాకెట్ ఉద్దేశం ఏంటో ఎప్పుడు,ఎవరు ఆలోచించి ఉండరు. కానీ ప్రస్తుతం ఈ కారణం ఏంటనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. అండర్గార్మెంట్స్ మార్కెట్ లో రిలీజ్ అయినప్పటినుండి క్రెడిట్ కార్డు సైజులో ఉండే ఈ పాకెట్ ఉన్నా కొందరు గుర్తించలేదు.ఒకవేళ కొందరు గుర్తించినా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో గ్రహించలేకపోయారు. వాస్తవానికి ఇది హైజెనిక్ రీజన్స్ వల్ల యాడ్ చేశారని తెలుస్తోంది. ఈ పాకెట్ తేమను పీల్చుకునే క్లాత్ తో కుట్టబడుతుండగా.. ఇది ప్రైవేటు పార్ట్స్ పొడిగా,వెంటిలేషన్ తో ఉండేలా సహాయపడుతుంది. ఎక్కువగా అబ్జర్బ్ చేసుకోవడంతోపాటు ఘర్షణను తగ్గించే విధంగా ఏర్పాటు చేయబడిన ఈ పాకెట్..ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
సింథటిక్ మెటీరియల్స్, రబ్బింగ్, చెమట, బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ అందించలేవు. కాబట్టి ఆ పాకెట్ తయారీకోసం కాటన్ మెటీరియల్ కే అధిక ప్రాధాన్యత ఇస్తారు.ఇక ఇన్నర్స్ కు ముందు బో ఉండడానికి గల కారణం ఏంటని ప్రశ్నించగా.. ఎలాస్టిక్ అందుబాటులోకి రాని కాలంలో నిక్కర్ ను టైట్ గా కట్టుకునేందుకు ఒక రిబ్బన్ లాంటి క్లాత్ ను వాడే వారని మరొక యూసర్ తెలిపారు.ఇప్పుడు ఎలాస్టిక్ యూస్ చేస్తుండగా పాత సాంప్రదాయాన్నే కొనసాగిస్తూ ఆ ప్లేస్లో బో మాదిరి సింబల్ ను ఇన్సర్ట్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు.ఇక మరో యూసర్ మహిళలు గతంలో పొద్దున్నే లేచి చీకటిలో లేదా క్యాండిల్ లైట్లో స్నానం చేసి దుస్తులు ధరించే వారు.ఈ క్రమంలో తాము ఇన్నర్ కరెక్ట్ గా దరిస్తున్నామా లేదా అని తెలుసుకునేందుకు ఉపయోగపడేది అని తెలిపాడు.