లైఫ్ స్టైల్: షేవింగ్ చేసిన తర్వాత మంట వస్తోందా..? మగ వారి కోసం ప్రత్యేకం..!!
తర్వాత చర్మం పొడిగా, చర్మం దురదగా కూడా చాలామంది అనిపించడం వల్ల బాధపడుతుంటారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ నాణ్యమైన రేజర్ తో పాటు మంచి షేవింగ్ క్రీములు కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ షేవింగ్ చేసిన తర్వాత చర్మం పొడిగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి చూడండి.
1. అలోవెరా జెల్:
ప్రధానంగా పొడి చర్మానికి అలొవెరా జెల్ చాలా అద్భుతమైనది. ఇక ఈ కలబంద జెల్ లో చర్మానికి మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగించడం వలన మంట నుంచి తక్షణ నివారణ కలుగుతుంది. మీ కిచెన్ గార్డెన్ లో అలోవేరా మొక్కలు పెంచుకున్నట్లయితే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది.
2. వెనిగర్ మరియు తేనె:
షేవింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా తేనెను మీ చర్మం పైన మీరు అప్లై చేయాలి. ఇక గోరువెచ్చని నీటితో పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుని , ఆ తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ ను ముఖం మీద కొద్దిగా చిలకరించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పొడి చర్మానికి మంచి ఉపశమనం కలగడంతో పాటు మంట దురద వంటి సమస్యలను దూరం చేస్తుంది.
వీటితో పాటు కొలైడాల్ ఓట్ మీల్ బాత్, హోమ్ మేడ్ లోషన్ , కార్న్ స్ట్రాచ్ , తేనెతో ఫేస్ ప్యాక్ లాంటివి ఉపయోగించవచ్చు.