వెల 'సిరి' : ఏకాదశినాడు.. శివైక్యం అయ్యారేమో!

పెద్దలు శివుడిలో ఐక్యం అయ్యే వారు ఏకాదశిలో పరమపాదిస్తారని అంటుంటారు. నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా అలాగే శివైక్యం అయినట్టుగా ఉన్నారు. గొప్పగొప్ప గంధర్వులు చిన్న పొరపాటు చేయడం వలన శాపగ్రస్తులై భూమిపైనా జనిస్తారని అంటారు. అలాంటి వారిలో బాలసుబ్రమణ్యం గారు, శైలజ గారు, సీతారామశాస్త్రి గారు ఉన్నారేమో అనిపిస్తుంది. ఎలా వచ్చారు, ఎందరిని మెప్పించారు, అలా వెళ్లిపోయారు. అసలే పవిత్ర కార్తీక మాసం, అది కూడా ఏకాదశి, చావులో కూడా మంచి చెడులు ఏంటనే హాస్యం అనిపిస్తుంది కానీ, గొప్పవారికి అలా అన్ని కలిసి వచ్చేట్టుగానే తల రాత రాస్తాడు కాబోలు ఆ బ్రహ్మదేవుడు. అందుకే వాళ్లకు అలా జరిగిపోతుంటాయి.
కావాలని నేడు పుట్టుకని వాళ్లకు అనుకూలంగా చేసుకుంటున్నారని కొందరు అనుకోవచ్చుగాక, అలా చేసుకొనే అనుమతి వాళ్ళ తలరాతలో ఉన్నది కాబట్టే అలాంటి ఆలోచన ఆ పుర్రెలో వచ్చింది. అలా లేదు కాబట్టే మిగిలిన వారికి అలాంటి ఆలోచన రాలేదు. ఏది ఏమైనా చావుపుట్టుకలు చేతిలో ఉండవు, దానిని ఎవరూ కూడా నిర్ణయించుకోలేరు. అయితే తలరాతలో గొప్పవాళ్లకు మంచి చావును, అదేసమయంలో మంచి సమయంలో చావును కలిపి రాస్తారు. అదే జరిగిపోతుంది. నేడు అలాగే జరిగినట్టుగా ఉంది. ఎందరో చనిపోతుండొచ్చు, కొందరి కోసమే ఎన్నో కళ్ళు ధారలవుతాయి. అలాంటి వారికి బహుశా మరో జన్మము ఉండబోదు కావచ్చు!
హిందూ ధర్మంలో ఇలాంటి విషయాలు చర్చించడం సహజం. అందునా ధర్మగ్రంధాలను ఇష్టానుసారంగా అర్ధం చేసుకుంటున్న ఈ సమయంలో ఈ చర్చ అవసరం కూడా. గొప్పవారి పుట్టుకలు, లేక పరమపదించిన విషయాలు తెలుసుకోవడం ద్వారా జననమరణాల పట్ల ఉన్న అపోహలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ రెండిటి మధ్య మానవుని లక్ష్యాలు ఏమిటనే ఆలోచన వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేడు కనీసం ఇలాంటి ఆలోచన చేసేందుకు కూడా సమయం లేనట్టుగా నాటకాలు ఆడుతూ బ్రతికేస్తున్నాం. రేపటి రోజున ఏమవుతుందో తెలియని పరిస్థితులలో కూడా నాదినాది అంటూ విశేషంగా భ్రమపడుతున్నాం. ఆయన వచ్చారు, ఎంతోమందిని పాటలతో అలరించారు, తన కర్తవ్యం అవగానే మరలివెళ్ళిపోయారు. అదే అందరికి వర్తించే సహజమైన జననమరణ చక్రం. కొందరు దాని నుండి తప్పించబడి బవంతుడిలో ఐక్యం అవుతారు అనేది జన్మరాహిత్యంగా చెప్పబడుతుంది. అదే మనిషి నిజమైన లక్ష్యం. ఆయనకు అది నేడు దక్కినట్టుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: