లైఫ్ స్టైల్: మీ ఇంటికి రెండు కంటే ఎక్కువ గుమ్మాలు ఉన్నాయా..? అయితే ఈ తిప్పలు తప్పవట..!

Divya
ఎవరైనా సరే ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉంటాయి.. ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి కదా అని అంటూ ఉంటారు.. ఇక శాస్త్రం కూడా ఇంటికి రెండు గుమ్మాలు ఉంటే ఆ ఇల్లు చాలా శుభకరమైనది గా చెబుతుంది. ఇక నాలుగు గుమ్మాలు ఉన్న ఇల్లు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తుంది అట.. ఇక శ్రమకు తగిన ఫలితం దొరకడమే కాకుండా గౌరవ ప్రతిష్టలు కూడా కలిగేలా చేస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అదే 6 గుమ్మాలు ఉన్న ఇల్లు అయితే ఇంట్లో అష్టైశ్వర్యాలతో పాటు పుత్ర వృద్ధి కూడా కలుగుతుంది.
8 గుమ్మాలు ఉన్న ఇల్లు అయితే అష్టైశ్వర్యాలను ఇస్తుంది అని సమాచారం.. సకల భోగభాగ్యాలు కూడా కలుగుతాయట. ఇక ఒక ఇంటికి 12 గుమ్మాలు కలిగిన ఇల్లు అయితే మంచి చదువు, ఉద్యోగం, వ్యాపారములలో వృద్ధి తో పాటు కీర్తి కూడా లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అదే ఒక ఇంటికి 14 గుమ్మాలు ఉన్నట్లయితే ధన సంపద , కుటుంబ అభివృద్ధికి కూడా కారణం అవుతుందట. అంతేకాదు 16 గుమ్మాలు ఉన్న ఇల్లు అయితే  అన్ని రకాల లాభాలు కలగడంతో పాటు జీవన లాభాలు పొంది, అధికారం కూడా పొందుతారట..
మన ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉంటే అది మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటికి మూడు గుమ్మాలు ఉంటే అపనిందలు, శత్రువుల వలన బాధలు, ఖర్చులు, ఆర్థిక బాధలు కూడా కలుగుతాయట. ఐదు గుమ్మాలు ఉన్న ఇల్లు అయితే సంతానానికి సంబంధించిన పీడలను కలుగజేస్తుందట..అంతే కాదు రోగాలు, శత్రువుల నుండి ఇబ్బందులు కూడా కలుగుతాయట. ఏడు గుమ్మాలు ఉంటే ఇంట్లో అనారోగ్యం, వ్యభిచార అలవాటు, అనుకోని కష్టాలు ఇలా రకరకాల నష్టాలు కలుగుతాయి. పది గుమ్మాలు ఉన్న ఇల్లు కష్టనష్టాలు కలిగిస్తే ,11 గుమ్మాల కలిగిన ఇల్లు భార్య వ్యభిచారం చేసే పరిస్థితిని కలుగజేస్తుంది. 13 గుమ్మాలు ఉన్న ఇళ్ల వల్ల మరణ ప్రమాదాలు కలిగితే పదహైదు గుమ్మాలు ఉన్న ఇంటి వల్ల అనేక నష్టాలతో పాటు అశాంతి కూడా ఏర్పడుతుంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: