ఇది.. ఆయా దేశాల అవిటితనం.. !

ప్రపంచంలో రానురాను ఆధిపత్యం, ఏకఛత్రాధిపత్యం చేయాలనే కోరికలు పెరిగిపోతున్నాయి. దానితో ఒకపక్క తీవ్రవాదం, మరోపక్క మూర్కపు దేశాలు మిగిల్చినది ఏమిటో ఒక ఫొటోగ్రాపర్ కేవలం ఒక్క ఫొటోతో చెప్పేశాడు. అందుకే అంటారు పాపం ఒకరిది, దానిని అనుభవించేవారు మాత్రం వేరే అని. అధికారం కోసం లేదా అధికారం ఉందని యుద్దాలపేరుతో దేశాలను నాశనం చేస్తున్నారు. అనంతరం అక్కడ ఉన్నవాళ్ళ బ్రతుకులు ఏమిటి అనేది కూడా కనీసం ప్రపంచ స్థాయి సంస్థలు కూడా గ్రహించలేకపోతున్నాయి. దీనితో అక్కడి వారు బ్రతికి చచ్చిపోతున్నారు. యుద్ధం సమయంలో ప్రాణాలు పోవడం ఒక మంచి, బ్రతికి బయటపడటం మరో మంచి, ఇక అటుఇటు కాకుండా అవిటితనంతో మిగిలిపోవడం అదో నరకం. అది కూడా రేపటి పౌరులు అలా మిగిలిపోతే వాళ్ళు మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలి, ఆ పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు..! ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
పెద్దదేశాలు, డబ్బూదస్కం ఉన్నదేశాలు అంటూ చిన్న దేశాలలో ఉన్న ఉగ్రభూతాలను చంపడానికి కనీసం అక్కడ నివాసముంటున్న వారిని ఖాళీ చేయించి చేసుకోవాలి, అలాంటివి ఏమి చేయకుండా ఇష్టానికి బాంబులు విసురుకుంటే అవి తగిలి కొద్ది ప్రాణాలతో మిగిలిపోయిన వారి పరిస్థితి ఏమిటో ఆలోచిస్తే అసలు జీవితంలో యుద్ధం చేయాలని అనిపించదు. సిరియాలో అంతర్యుద్ధం సృష్టించిన భయానక పరిస్థితులు ఇప్పటికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ బాంబు వచ్చి పడుతుందో కూడా తెలియని పరిస్థితులలో అక్కడ వారు నివసిస్తున్నారు. ఎందరో అభాగ్యులుగా అరకొర అవయువలతో బ్రతికారు. చిన్నా పెద్దా, పసి ప్రాణాలు అనే తేడా లేకుండా అందరు ఇలాంటి పరిస్థితులలో ఉన్నారు.
ఆ పరిస్థితుల నుండి బయటపడి సాధారణ జీవితం ప్రారంభించడానికి ఎంత మనోధైర్యం కావాలో తెలుసా.. అసలు ప్రపంచ సంస్థలు ఇలాంటివి ఆపకపోతే ఇక ఉండి ప్రయోజనం ఏమిటో అర్ధం కాదు. అలాంటి పరిస్థితి నుండి బయటపడిన ఒక తండ్రి, కొడుకు పరిస్థితిని చూపించే చిత్రం అది, అందులో తండ్రికి ఒక కాలు పోతే, బిడ్డకు రెండు కళ్ళు పోయాయి. ఆ బిడ్డ ఇంకా పాఠశాల వయసు కూడా ఉండదు. అయినా బిడ్డలో మానసిక ధైర్యాన్ని నింపడానికి తాను నవ్వుతు, బిడ్డను నవ్విస్తూ ఉన్న ఆ ఒక్క ఫోటో చాలు సిరియాలోనే కాదు ఎక్కడ యుద్దాలు జరగవు. దానిని చూసి అర్ధం చేసుకున్నవారు ఎవరు ఇక యుద్ధాల జోలికి పోరు. మనసులేని వాళ్ళు యుద్ధాలకు దిగుతారు, అలాంటివాళ్లకు ఇంకెంత భయానక సందర్భాలు చూపించినా మారరు. మనుషులైతే మారతారు, మారని వారు ఇంకేజాతికి చెందుతారో వాళ్ళకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: