లైఫ్ స్టైల్: ఈ దీపావళికి మీ ఇంటిని ఇలా అలంకరించండి..!!

Divya
మరో వారం రోజుల్లో దీపావళి పండుగ రాబోతోంది.. ఇంటి చుట్టూ దీపాల కాంతులు.. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ఎంతో అంగరంగ వైభవంగా ఈ దీపావళిని చిన్నాపెద్ద అందరితో సంతోషంగా జరుపుకుంటారు.. అలాంటి ఇంత పెద్ద సంతోషాన్నిచ్చే పండుగను ఎలా జరుపుకోవాలి.. ముఖ్యంగా మన ఇంటిని అందంగా ఎలా అలంకరించుకోవాలి..అనే విషయాలు తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు.. సాధారణంగా ఎవరైనా సరే ఈ పండుగకు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు..

కేవలం మీరు కొత్త ఇల్లు ను కొంటేనే సరిపోదు.. ఆ ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకున్న అప్పుడే ఆ ఇంటికి కొత్తదనం అనేది వస్తుంది.. ఇంటి అలంకరణలో ఇంటీరియల్ డెకరేషన్ అనేది మొదటి పాత్ర పోషిస్తుంది. ఇక ముఖ్యంగా ఇంటి అలంకరణ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని అనుకుంటే మాత్రం పొరపాటే.. చిన్నపాటి అలంకరణలతో, మార్పులతో సాధారణంగా కనిపించే మీ ఇంటికి ఆకర్షణీయమైన లుక్ తీసుకురావచ్చు..

ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇంటి గుమ్మాలకు తోరణాలు తో, పూలతో అలంకరించడం వల్ల సరికొత్త ఆధ్యాత్మికతను తీసుకురావచ్చు.. అంతే కాదు మీ ఇంటికి అక్కడక్కడ పెయింటింగ్ వేస్తే అదనపు ఆకర్షణ అవుతుంది.. పూజా సమయంలో మీ ఇంటిలో దూపం, అగరవత్తులు వేసి చూడండి మీ ఇల్లు ఒక దేవాలయం గా అనిపించకమానదు.. అంతేకాదు ఇంట్లోని వస్తువులు కూడా చాలా అందంగా ఉండేలా చూసుకోవాలి.. ఇక ఇంట్లో ఉండే వస్తువులు అందంగా ఉండడం అనే విషయానికి వస్తే వాటి పరిశుభ్రత, రంగు ,అలంకరణ, నాణ్యత వంటి పలు అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.. ఇక గుమ్మం ముందు ఇరువైపులా రెండు మంచి పూల కుండీలను కూడా ఏర్పాటు చేసుకోండి..
ఇక మీ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేసుకున్నా సరే ఇంట్లోకి వెలుతురు, గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి.. ఇలా చిన్న చిన్న అలంకరణలతో ఈ పండుగ వేళ మీ ఇంటిని మరింత కాంతిగా తయారుచేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: