భర్త : నన్ను జైల్లో పెట్టండి.. మహాప్రభో..!

ఒత్తిడి తెస్తున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. కానీ ప్రతిదానిని ఒత్తిడిగానే భావించే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. దీనితో వాళ్ళు చిన్న చిన్న పరిస్థితులను కూడా నిర్వహించలేక ఆందోళనకు గురవుతున్నారు. అప్పుడే చిన్న పొరపాటు చేస్తూ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ దాదాపుగా రేపటికి జీవించడం ఎలా అనే దానిగురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు తప్ప కళ్ళముందు ఉన్న ప్రస్తుత క్షణాన్ని మాత్రం ఆస్వాదించలేకపోతున్నారు. దానితో ప్రస్తుతం శూన్యం అయిపోతుంది. చివరికి ఒత్తిడే మిగులుతుంది. కేవలం ప్రస్తుతం చూసుకుంటూ, భవిష్యత్తుకు కనీస ఏర్పాటు చేసుకుంటే ధీమాగా బ్రతికేయవచు. అలా కాకుండా ఎంత ఉన్నప్పటికీ తృప్తి లేకుండా జీవిస్తూ ఉంటె ఒత్తిడి తప్ప మరొక్కటి ఏమి కనిపించదు. భవిష్యత్తులో జరగాల్సినదానికి సిద్ధంగా ఉంటూ, ప్రస్తుతాన్ని ఆస్వాదించాలి అప్పుడే ప్రస్తుతం భయంకరంగా కాకుండా అందంగా కనిపిస్తుంది.
కొందరు ఒత్తిడి తట్టుకోవడానికి అనవసర విషయాలను జీవితంలోకి ఆహ్వానిస్తుంటారు. అంటే  మద్యం, మాదకద్రవ్యాలు వంటివి. అయితే అవి బాధనో, ఒత్తిడి నో తగ్గించకపోగా, ఉన్న అనుబంధాలను దూరం చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ అందుకు కూడా సిద్ధపడుతున్నారు కొందరు. అనుబంధాలు లేనప్పుడు లేవని ఏడుపు, ఉన్నప్పుడు ఒత్తిడి అని ఏడుపు ఇలా అయితే ఎలా అనే ఆలోచన వారిలో వస్తే, పరిష్కారం కూడా అదే కనిపిస్తుంది. అలా కాకుండా ఒక సమస్య వచ్చిందని ఇంకో  నెత్తికెక్కించుకుంటే తరువాత ఒత్తిడి మరింత పెరిగిపోతుంది.  
తాజాగా ఇలాంటి కేసు ఒకటి  బయటపడింది. అటు కార్యాలయంలో, ఇటు ఇంట్లో ఒత్తిడి తట్టుకోలేక భర్త సరాసరి పోలీసు స్టేషన్ కు వెళ్లి నన్ను జైల్లో పెట్టండి మహాప్రభో అని వేడుకున్నాడట. ఇంటికంటే జైలే మేలు అనుకున్నాడు ఆ భర్త.  ఇదంతా ఒత్తిడితో  తిప్పలే. ఆల్బేనియాలో ఒక వ్యక్తి మాదకద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడ్డాడు. దీనితో అతడికి న్యాయస్థానం గృహ నిర్బంధ శిక్షను విధించింది. అంటే సమస్య మొదలు, భార్య అతడితో ఎప్పుడు ఎదో ఒక గొడవ పడుతూనే ఉండేది. ఇంక భరించలేనని భర్త అనుకోవడంతో నేరుగా జైలుకు వెళ్లి నేను ఇక్కడే ఉంటాను, ఇంట్లో నావల్ల కావడం లేదు అని వేడుకున్నాడట. అతగాడి సమస్యను అర్ధం చేసుకున్న అధికారులు కూడా జైల్లోనే ఉండమన్నారట. తాజా లాక్ డౌన్ లోను అందరికి ఇదే సమస్య మరి. కాకపోతే అతగాడికి అవకాశం ఉంది, లాక్ డౌన్ వలన ఇళ్లలో ఉన్న భర్తలకు పాపం ఆ అవకాశం ఉండ లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: