తల్లికి వందనం : బతుకమ్మ పాటకు రెహ్మాన్ స్వరాలు
బతుకు ఇచ్చే తల్లికి వందనం.. పల్లె దారుల్లో నడిపించే పండుగకు వందనం.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో అని పాడుకోవాలి మనం..అవును! తల్లికి వందనాలు చెబుతూ, ప్రకృతి పాటకు వందనాలు చెబుతూ చేసే ప్రయాణం ఈ రోజు నుంచి తెలంగాణ వాకిట ప్రారంభం కానుంది. తీరున్నొక్క పూలతో ఆ తల్లిని కీర్తించే పండుగకు సంబంధించి ఇప్పుడొక మంచి వార్త విశేష సంబంధం అయిన వార్త వెలుగు చూసింది. బతుకమ్మ పాటకు సంబంధించి కొత్తగా రాయించే సాహిత్యానికి స్వరాలు సమకూర్చే బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ అందుకున్నారు. ఆయన స్వరకర్తగా ఉంటూ రూపొందే పాటను మరో ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మేనన్ పిక్చరైజ్ చేయనున్నారు. దీన్నొక అరుదైన గౌరవంగా తాను భావిస్తున్నానని చెప్పారు ఏఆర్ రెహ్మాన్. ఈ మేరకు తెలంగాణ జాగృతి ఆనందం వ్యక్తం చేస్తుంది. తమ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత రెహ్మాన్ స్వరాలు కూర్చడం దేశ విదేశాల్లోనూ తమ సంస్కృతి మరింత ప్రాచూర్యం దక్కించుకునేందుకు ఓ గొప్ప అవకాశం అని అంటున్నారు కవితక్క కార్యకర్తలు.