సూసైడ్ నోట్ : ఆ ఇంటివారిని ఎవరూ పెళ్లి చేసుకోవద్దు

రోజురోజుకు గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా తెచ్చిపెట్టిన సంక్షోభం లో ఈ పరిస్థితి మరింతగా ఎక్కువ అవుతుందని మనస్తత్వ నిపుణులు చెపుతున్నారు. పని చేసేవారిపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా మానసిక సమస్యలు అనేకం తలెత్తుతున్నట్టు నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే గతంలో మాదిరే సాధారణ గృహ హింస లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో పలుచోట్ల మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో మహిళలపై ఇళ్లలో కూడా హింసలు పెరిగిపోతున్నట్టు వారు చెబుతున్నారు. మనిషి ఆయా పరిస్థితులను అలవాటు చేసుకుంటూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వలన ఒత్తిడి లో కూడా మానసిక సమస్యలను అధిగమించ వచ్చు అంటున్నారు నిపుణులు. కేవలం తనపైనే కుటుంబం అదరపడిందనే ఒత్తిడి కూడా ఆయా కుటుంబ సభ్యుల సహకారంతో అధిగమించవచ్చు అని, దానికి కుటుంబ సభ్యులు ఉపాధి వెతుక్కుంటే కాదనకుండా కొన్నాళ్ళు పరిస్థితి కి తలవంచాలని అలా చేయడం వలన ఆర్థికంగా కూడా ఒత్తిడి తగ్గుతుందని వారు సూచిస్తున్నారు.

ఇక సాధారణ గృహ హింసల విషయానికి వస్తే, వాటిలో ఎక్కువ నేపథ్యం వరకట్నం లాంటి దురాశ మాత్రమే అని నిపుణులు అంటున్నారు. అలాంటి వారిని ఉపేక్షించకుండా తగిన విధంగా శిక్షలు విధించడం లేదా ప్రారంభ దశలోనే మానసిక నిపుణులతో వారికి కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తేవచ్చు అంటున్నారు. అయినా వారిలో మార్పు లేకపోతే అప్పుడు శిక్ష అమలు చేయాలని వారు సూచిస్తున్నారు. మహిళలు చాలావరకు ధైర్యంగా బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొందరు మాత్రం ఇంకా భర్తలపై ఆధారపడుతూ, అక్కడ ఇమడలేక, తల్లిదండ్రుల వద్దకు చేరలేక ఇరకాటంలో పడుతున్నారు.

అలాంటి ఒక ఘటన ప్రాంతీయంగా కలకలం రేపింది. గత ఏడాది వివాహం చేసుకొని ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆమె కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఆ ఇంట అడుగుపెట్టిన మరుక్షణం నుండే వేధింపులతో నరకం చూపిస్తున్నప్పటికీ పుట్టింటివారు తన పెళ్లికోసం చేసిన అప్పుల భారం గుర్తుకు తెచ్చుకొని అవన్నీ భరిస్తూ వచ్చింది. ఏడాది గడిచింది, వేధింపులు పెరిగాయి తప్ప మార్పు లేదు. ఇక తాళలేక పుట్టింటికి వెళ్ళింది ఆమె. అక్కడ తల్లిదండ్రుల అప్పుల బాధలు కూడా చూస్తూ ఎక్కువ కాలం ఉండటం సాధ్యం కాదని అర్ధం చేసుకుంది. ఒక రాత్రి అందరితో కలిసి తిని, పడుకుంది. అందరు పడుకున్న తరువాత ఆత్మహత్య చేసుకుంది. తన మెట్టినింట్లో తాను అనుభవించిన నరకాన్ని సవివరంగా సూసైడ్ లేఖలో రాసి, ఆ ఇంటి వారిని ఎవరు పెళ్లి చేసుకోవద్దు అంటూ వాపోయింది. ఇదంతా తెల్లవారిన తరువాత తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వాళ్ళు కేసు నమోదు చేసుకొని, నేరస్తుల కోసం గాలింపు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: