లైఫ్ స్టైల్: ఇలా చేస్తే కోటీశ్వరులు అవ్వచ్చు..!

Divya

సాధారణంగా మనం డబ్బులు ఎంత సంపాదించినప్పటికీ, వాస్తు సరిగా లేకపోతే ఆ డబ్బు అంతా ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది అని చెబుతున్నారు.  అయితే ఇప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఇంట్లో డబ్బు ఎప్పుడు ఉంటూనే కోటీశ్వరులు అవ్వచ్చట. అయితే వాస్తు ప్రకారం ఏమి చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
వినాయకుడి ఫోటో:
వినాయకుడి ఫోటోలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపు కానీ లోపల వైపు కానీ గణపతి చిత్రపటాన్ని తప్పకుండా ఉంచాల్సిందే. లేదా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంపదలు చేకూరుతాయి.
తులసి మొక్క:
ఇంటి ఆవరణంలో  తులసి మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిశగా మొక్కలు నాటాలి. ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి, సౌభాగ్యం గా ఉండడమే కాకుండా ధనానికి ఏ లోటు కూడా ఉండదట. ఇక తులసి మొక్క డబ్బుకు ప్రతీక కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈశాన్య దిక్కున తులసి మొక్కను పెట్టుకోండి.
పూజా మందిరం:
ప్రతి రోజు మీ పూజ మందిరంలో ఉదయం, సాయంత్రం పూట తప్పకుండా ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల ఆ ఇల్లు ఎంతో పవిత్రంగా మారుతుంది. ఇక అంతే కాదు మీ పూజ మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని తప్పకుండా ఉంచుకోవాలి.
కుబేర యంత్రం:
వడ్డీ కాసుల వాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కాసులను అప్పుగా ఇచ్చాడు కుబేరుడు. అంతటి సంపదలకు ప్రతీక ఈ కుబేరుడు. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశను కుబేరుడు పరిపాలిస్తాడు. ఈ దిశ లో అత్యధిక బరువు ఉన్న వస్తువులు కానీ, చెప్పుల స్టాండ్  కానీ, టాయిలెట్లు కానీ ఉంచరాదు. మీ ఇంట్లో డబ్బులు ఉండాలంటే ఇలా చేసి చూడండి.
నీటి కుండ:
ఈశాన్యం దిక్కున అక్వేరియం కానీ చిన్న ఫౌంటైన్ లు కానీ లేదా నీటితో నింపిన కుండ పెట్టడం వల్ల సంపదలు చేకూరుతాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: