లైఫ్ స్టైల్ : పాలకు బదులు వీటిని తినవచ్చా..?

Divya
సాధారణంగా పాలల్లో చాలా ఉత్పత్తులు ఉంటాయని, ప్రతి ఒక్కరు తప్పకుండా పాలను తాగాలి అని వైద్యులు సూచిస్తుంటారు. కానీ కొంతమందికి పాలను చూస్తూనే వాంతులు అవుతాయి అని కొంతమంది వద్దు బాబోయ్ అంటూ ఉంటారు.. అంతేకాదు పాలకు బదులు ఏ ఉత్పత్తులు తీసుకుంటే మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే వీటిని తింటే పాలు తాగాల్సిన అవసరం లేదు అని అంటున్నారు వైద్యులు.
అవే..సోయా ఫుడ్స్..వీటిని  తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదట. ముఖ్యంగా సోయా ఫుడ్స్ అనగా ఏమిటి అంటే,  సోయాబీన్స్ ద్వారా కొన్ని ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు.. ఇది నిజంగా పాల కంటే చాలా మంచిది అని చెప్పవచ్చు. ప్రోటీన్స్ ఉండటంతో పాటు న్యూట్రియన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కేవలం మొక్కల నుండి మనకు లభిస్తాయి.. ఎసెన్షియల్ ఎమైనో ఆసిడ్స్  కావాలనుకునేవారికి  మాంసాహారంలో మాత్రమే లభిస్తుంది.. కానీ దీనిని శాకాహారులు తినరు కాబట్టి.. పుష్కలంగా సోయాబీన్స్ ను తినవచ్చు.. వీటిలో మాంసకృత్తులు కూడా లభిస్తాయి..

జుట్టు పెరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. 31 శాతం మనకు కొవ్వు పదార్థాలు లభిస్తాయి కాబట్టి వీటి వల్ల ప్రయోజనాలు ఎక్కువ.. ఈ సోయాబీన్స్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. శరీరానికి కావల్సిన క్యాల్షియం, లాక్టోజ్ కూడా లభిస్తుంది. క్యాల్షియం లోపంతో బాధపడుతున్న వారు వీటిని బాగా తినవచ్చు. మెగ్నీషియం, సెలీనియం, ఐరన్, మినరల్స్ వంటి పోషకాలు కూడా సోయాలో ఎక్కువగా లభిస్తాయి.

ఇక వీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి పాలు తాగే లేను అనుకునేవారు పాలకు బదులుగా ఈ సోయాబీన్స్ తీసుకోవచ్చు. మీకు కూడా పాలు తాగడం ఇష్టం లేకపోతే మీ ఆహారంలో ఈ సోయాబీన్స్ ను చేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: