లైఫ్ స్టైల్ : వర్షాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన ఆహార పదార్థాలు..

Divya
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. సాధారణంగా చాలా మంది సీజనల్ వ్యాధులకు గురి అవుతుంటారు. ముఖ్యంగా జలుబు , తలనొప్పి, జ్వరం,దగ్గు , ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలతో ఈ కాలంలో ఎంతోమంది అవస్థ పడుతూ ఉంటారు. అయితే ఈ కాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనం తినే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే, మరి కొన్ని ఆహార పదార్థాలకు అత్యంత చేరువలో ఉండాలి అని వైద్యులు సలహాలు ఇస్తున్నారు..

ముందుగా మనం ఈ వర్షాకాలంలో ఏ పదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

వర్షాకాలంలో సముద్రంలో దొరికే చేపలను అసలు తినకూడదు. అలాగే ఆకుకూరలు, రోడ్ సైడ్ ఫుడ్, నూనె పదార్థాలు వంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా చలి వాతావరణంలో బ్యాక్టీరియా అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆకుకూరలు, చేపలలో వీటి అభివృద్ధి రోజురోజుకీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత వీటిని దూరంగా ఉంచడమే మంచిది.

ఇక ఈ వర్షాకాలంలో మనం వారంలో ఎక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

ఉడికించిన వేరుశనగ గింజలు, మొక్కజొన్న, తీగల ద్వారా లభించే కూరగాయలు, వేర్లతో భూమి లోపల పండే కూరగాయలు, ఉడికించిన పప్పు దినుసులు వంటివి ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీటితోపాటు నెలలో ఒక్కసారైనా వరి పిండితో తయారు చేసిన కుడుములు, గోంగూర పప్పు లేదా గోంగూర తో చేసే వంటకాలు ఏవయినా సరే తినవచ్చును. అలాగే చామదుంపలను కూడా ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక వీటిని మనం వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: