లైఫ్ స్టైల్ : డాల్డా అధికంగా తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

Divya
 
చాలామంది వంటలలో ఈ డాల్డా ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని వనస్పతి అని కూడా అంటారు. వనస్పతి నెయ్యిని పోలి ఉంటుంది. ఈ వనస్పతిని ఎలా తయారు చేస్తారు అంటే, నూనె గింజల నుండి నూనెను తీసే ఈ సమయంలో హైడ్రోజిషన్ వల్ల మామూలు నూనె కాస్త డాల్డా లాగా ఏర్పడుతుంది. ఇక ఈ వనస్పతి తినడం వల్ల మనలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఆయిల్స్ ఎక్కువగా వాడడం వల్ల మనలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అయితే వీటి వల్ల కలిగే నష్టాలు ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు:
మామూలు నూనెలతో పోలిస్తే , ఇందులో కొవ్వు నిల్వలు అధికంగా ఉంటాయి. ఇక ఈ వనస్పతిని సాధారణంగా జంతువుల నుంచి తయారు చేస్తారు. ఇందులో అధిక శాతం కొవ్వు ఉండడం వల్ల శరీరం బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పొత్తి కడుపులో ఎక్కువ మొత్తంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు సమస్యలు తలెత్తుతాయి.
గుండె పోటు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు అందించిన సూచనల ప్రకారం , మనం తీసుకునే ఆహారంలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు ముఖ్యంగా నాలుగు శాతం కంటే తక్కువ ఉండాలి. ఇక మన దేశంలో ఉపయోగించే వనస్పతిలో దాదాపు 40 నుంచి 50 ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు  కలిగివున్నాయని, ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందుకే ఇందులో ఉండే కొవ్వు మన గుండెకు చేరి గుండె పోటు వచ్చేలా చేస్తాయి.
పిల్లల్లో దృష్టి లోపం:
ముఖ్యంగా గర్భం దాల్చిన ఆడవారిలో పాలీ అన్సాచ్యురేటెడ్ కొవ్వు పదార్థాలు, వారి పిండానికి సంబంధించినటువంటి నాడీ వ్యవస్థ పెరుగుదల పై, ప్రభావం చూపడంతో పాటు దృష్టికోణంలో కూడా ఎన్నో ఇబ్బందులను తీసుకొస్తాయి. కాబట్టి గర్భం దాల్చిన మహిళలు ఈ డాల్డా తినడం వల్ల కడుపులో ఉండే పిండానికి సంబంధించిన దృష్టి లోపం వచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎంత వీలైతే అంత డాల్డా తినకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: