వర్షాకాలంలో ఆలుబుఖార పండు తింటే ఏమవుతుందో తెలుసా.?

Suma Kallamadi
ఆలూ బుఖరా పండ్ల గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది.ఈ పండ్లు చూడడానికి ఎరుపు-నీలం రంగులో  ఉంటాయి. ఈ పండ్లు మనకి వర్షా కాలంలో ఎక్కువగా పండుతాయి.చూడడానికి ఆకర్షణీయంగా, తినడానికి కొంచెం పుల్ల పుల్లగా, తియ్యగా ఉంటాయి.ఈ  ఆలూ బుఖరా పండ్లు తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఈ పండ్లు ఎక్కువగా రెయినీ సీజన్‌లో పండుతాయి.ఈ పండ్లను  హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లలో పండిస్తారు. ఎన్నో పోషకాలు కలిగిన ఈ పండ్లలో పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు తినడం వలన ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం. !

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.మలబద్ధకంతో ఇబ్బంది పడేవాళ్ళు ఆలూబుఖరా పండ్లు తింటే మంచిది. వీటిలో ఇసాటిన్, సార్బిటాల్ ఎక్కువగా ఉండడం వలన  ఇవి మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆలూ బకరా పండ్లు క్యాన్సర్ నుంచి మనల్ని రక్షిస్థాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గొంతు, నోటి క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. ఆలు బుఖరా పండ్లలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు రక్త కణాల ఉత్పత్తికి చాలా అవసరం.
ఆలు బుఖరా పండ్లు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఆలుబుఖరా పండ్లు ఎముక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్థాయి. ఇందులో ఉండే బోరాన్ ఎముక సాంద్రతను కాపాడటంతో పాటు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైనది. ఈ పండులో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.ఇందులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటంతో పాటు, ఆల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయపడుతుంది.అలాగే కంటి చూపును కూడా మెరుగు పరుస్తుంది.చూసారు కదా ఈ పండు యొక్క ఉపయోగాలు. మరి ఈ పండు మీకు మార్కెట్లో ఎక్కడ కనిపించిన కొనడం మాత్రం మరవకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: