ఎగ్ 65 ను ఎలా తయారు చేస్తారో తెలుసా?
కావలసిన పదార్థాలు :
గుడ్లు: 3,
మైదా: అర కప్పు,
కార్న్‌ఫ్లోర్: పావు కప్పు,
పెరుగు: అర కప్పు,
అల్లం: అర టీ స్పూన్,
వెల్లుల్లి రెబ్బలు: నాలుగు,
పచ్చిమిర్చి: నాలుగు,
కొత్తిమీర తురుము: ఒక టేబుల్ స్పూన్,
చక్కెర: చిటికెడు,
చిల్లీసాస్: ఒక టేబుల్ స్పూన్,
ఉప్పు: తగినంత,
నూనె: సరిపడా
కారం: ఒక టేబుల్ స్పూన్,
గరం మసాలా: ఒక టీ స్పూన్,
బ్రెడ్ క్రంబ్స్: కొద్దిగా,
కరివేపాకు: రెండు రెబ్బలు,
తయారీ విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి గుడ్లు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టాలి. తర్వాత తొక్క తీసేసి కేవలం తెల్ల గుడ్డు ను మాత్రమే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక పాత్రలోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, తరిగిన అల్లం ముక్కలు, గరం మసాలా, బ్రెడ్ క్రంబ్స్, పిండి వేసి కలపాలి. ఆ మిశ్రమానికి గుడ్లు కొట్టి కలపాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి. కడాయిని పెట్టుకొని నూనె వేసి వేడి అయ్యాక. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని గోధుమ రంగులోకి వచ్చేవరకు వచ్చాక తీసివేయాలి. ఇప్పుడు స్టవ్‌పై గిన్నెపెట్టి కాస్త నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆతర్వాత కాస్త పెరుగు, కారం, చిల్లీ సాస్ లను వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత గరం మసాలా, చక్కెర, కొత్తిమీర వేశాక, వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కలను వేసి మొత్తం ముక్కలు బాగా కలిసేలా తిప్పాలి. అంతే ఎంతో రుచికరమైన ఎగ్ 65 రెడీ..