బిల్ గేట్స్ దంపతుల విడాకులకు.. అసలు కారణం ఇదేనా?

praveen
ఇటీవలి కాలంలో అటు సోషల్ మీడియాను ఊపేస్తున్న వార్త ఏది అంటే అందరు టక్కున చెప్పేది బిల్గేట్స్ దంపతుల విడాకుల వార్త గురించే. ఎందుకంటే 27 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నాము అంటూ ప్రకటించడం వెంటనే విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే 27 ఏళ్ల దాంపత్య బంధం విడిపోవడానికి అసలు కారణం ఏంటి అనే దానిపై అటు ఎంతోమంది  ఆలోచనలో పడ్డారు 27 ఏళ్ల పాటు అటు వ్యాపారంలో మరోవైపు సామాజిక కార్యక్రమాలలో కూడా ఇద్దరూ కలిసి ఎంతగానో అద్భుతంగా పని చేశారు.



 ఇక ఇలా ఏకంగా బిల్ గేట్స్ దంపతులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అని చెప్పాలి. అలాంటి వాళ్ళు ఒక్కసారిగా 27 ఏళ్ల దాంపత్య బంధానికి బ్రేక్ చేసి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం మాత్రం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది..  అసలు వీరిద్దరూ ఈ వయసులో విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అన్న దానిపై సరైన కారణం ఇప్పుడు వరకు బయటికి రాలేదు. కానీ ఇటీవలే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై ఒక వార్త వైరల్ గా మారిపోయింది.  అయితే ఇప్పుడు కాదు ఇద్దరు దంపతులు ఎప్పుడో విడాకులు తీసుకోవాలని భావించారట. కానీ తన చిన్న కూతురుకి 18 ఏళ్లు నిండేంత వరకు కలిసి ఉండాలని భావించి విడాకులు తీసుకోకుండా ఉండిపోయారు అనే విషయం బయటకు వచ్చింది.



 బిల్ గేట్స్ మిలిందా దంపతులకు ముగ్గురు సంతానం  ఉన్నా విషయం తెలిసిందే. అయితే చిన్న కూతురు కి మాత్రం ఇటీవలే 18 ఏళ్లు నిండాయి. ఈ క్రమంలోనే ఎప్పుడో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకున్నప్పటికీ చిన్నకూతురు  18 ఏళ్లు నిండేంత వరకు ఆగాలని నిర్ణయించుకున్నారట. ఇక ఇటీవల చిన్న కూతురుకి 18 ఏళ్ళు నిండడం తో విడాకులు తీసుకోవాలని భావించి విడాకులతో 27 ఏళ్ల దాంపత్య బంధాన్ని బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: