ఫ్రిడ్జ్ లో వీటిని అస్సలు పెట్టకూడదట.. ఎందుకంటే?

Satvika
ఫ్రిడ్జ్ లో  తినే ఆహారపదార్థాలను పెడితే తాజాగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అయితే, అన్నిటినీ ఫ్రిడ్జ్ లో పెడితే మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎటువంటి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.. చట్నీలు, తొక్కులను కూడా చాలామంది ఫ్రిజ్‌లో పెడుతూనే ఉంటారు.సూర్యకాంతి పడకుండా తొక్కులను రెండు మూడేళ్ల పాటు నిల్వ చేయవచ్చు. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని చల్లటి ఉష్ణోగ్రతలకు తొక్కులు తొందరగా పాడవుతాయి.


దోసకాయలను కట్ చేశాక ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి దోసకాయ ముక్కలను తినడానికి బదులు.. చలవ చేసేందుకు కంటిపై రుద్దుకునేందుకు మాత్రమే వాడ టం మంచిది.


ఇకపోతే బ్రెడ్.. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అది డ్రైగా మారుతుంది. ఎక్కువ రోజులు అలాగే ఫ్రిజ్‌లో పెడితే బూజు పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీలైనంత వరకు బ్రెడ్‌ను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం మంచిది.


తేనెను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల తొందరగా చిక్కబడి.. గట్టిగా తయారవుతుంది. అప్పుడు దాన్ని వాడటం కష్టమైపోతుంది. కొంతమంది నూనెలను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అది మంచిది కాదు. గది ఉష్ణోగ్రత వద్దే నూనెలను ఉంచడం మంచిది. ఇక కాఫీ పౌడర్ ను కూడా ఫ్రిడ్జ్ లో పెడతారు. ఇలా పెట్టడం వల్ల రుచి, వాసన తగ్గిపోతుంది.


 బిస్కెట్లు, కాక్లెట్లు, పండ్లు, ఆకుకూరలు, పచ్చి కొబ్బరి, పాలు, పెరుగు, కొబ్బరి నీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. కండ్లు, చెవుల్లో వేసుకునే చుక్కల మందును కూడా ఫ్రిజ్‌లో ఉంచవచ్చు..ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వాటిపై తొక్కలోని తేమ ఆవిరై గట్టిపడుతుంది. దీనివల్ల ముక్కలు తరగడం కష్టమవుతుంది. అలాగే లోపల ఉండే పిండి పదార్థం తేమను పూర్తిగా కోల్పోతుంది. ఫలితంగా వంటకాలు రుచి పచి లేకుండా చప్పగా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉండే చల్లని ఉష్ణోగ్రతల కారణంగా ఆలుగడ్డల్లో చక్కెర శాతం త్వరగా పెరిగే అవకాశం ఉంది... ఇంక పుదీనా, ఉల్లిగడ్డలు, టమాటాలు, పుచ్చకాయలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: