గాఢ నిద్ర రావాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి.. !!
మనలో చాలా మంది ప్రశాంతమైన నిద్రకోసం ప్రతి రోజు ప్రయత్నిస్తు ఉంటాము. కానీ మన ఈ ఉరకల పరుగుల జీవితంలో ఇది సాధ్యం కావట్లేదు.మనిషి ఆరోగ్యకరం గా జీవించడానికి , రోజుకు కనీసం 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. అలాగే మనం పడుకున్న తరువాత గాఢ నిద్రలో ఎంతసేపు ఉన్నాము అనేది చూసుకోవాలి. ఇటువంటి గాఢ నిద్ర పట్టాలంటే మన ఆహారం
లో కొన్నిపదార్ధాలు తప్పని సరిగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ! మన.అందరికి విరివిగా దొరికే పండ్లలో అరటిపండ్లు కూడా ఒకటి.వీటిలో మెగ్నీషియం, పొటాషియం వంటివి మన కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి.అరటిలో ఉండే కార్బోహైడ్రేట్ రక్తంలోని గ్లూకోజ్ తగ్గకుండాచేసి నిద్ర త్వరగా రావడానికి సహాయపడతాయి.
అలాగే ప్రతి రోజు ఆహారంలో బాదం పప్పు, వాల్నట్స్ ఉండేలా చూసుకోండి. డ్రై ఫ్ఫ్రూట్ లలోఉండే మెగ్నీషయమ్,మాంగనీస్, భాస్వరం, రాగి ఇవన్నీ అధిక కొవ్వును తగ్గిస్థాయి. అలాగే నిద్రకి అవసరమయ్యే మెలటోనిన్ అనే రసాయనం విడుదలకు సహకరిస్తాయి.నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు పాలు తాగడం ఎంతో మంచిది. పాలల్లో ఉండే అమినో ఆసిడ్లు, ట్రైఫ్టోనీన్ వంటివి శరీరంలో సెరటోనిన్ విడుదల చేస్తాయి. ఇది నిద్రన ఉపక్రమించే ఒక రసాయనము.అందుకే నిద్రపోయే ముందు ఒక గ్లాస్ స్వచ్చమైన పాలు త్రాగితే నిద్ర త్వరగా వస్తుంది..