ఎకో ఫ్రెండ్లీ స్ట్రాలు వచ్చేసాయి.. ఇకపై పర్యావరణానికి ఎలాంటి హాని లేదు..!

Divya

ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ కుప్పలు, దిబ్బలుగా పేరుకుపోయి పర్యావరణానికి విపరీతమైన నష్టాన్ని కలగజేస్తోంది. అంతేకాకుండా ప్లాస్టిక్ తో తయారు చేసే ఏ చిన్న వస్తువు అయినా సరే అది పర్యావరణానికి ఎంతో హాని కలగజేస్తుంది  అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఇప్పుడు ఎండాకాలం రాబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కొబ్బరిబోండం పై ఆధార పడుతున్నారు. అయితే కొబ్బరి బొండానికి పర్యావరణానికి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా..! అవును దానికీ సంబంధం ఉంది. ఎండాకాలం లో ఎక్కువ మంది కొబ్బరి బొండం లోని నీళ్లు తాగాలి అంటే ఎక్కువగా స్ట్రాలను ఉపయోగిస్తున్నారు.


చాలామంది ఈ స్ట్రా ల సహాయం తో కొబ్బరి బొండం లోని నీళ్లు తాగాక,  ఆ రెండింటిని విసిరేస్తూ ఉంటారు. అయితే కొబ్బరి బొండం మట్టిలో కలిసి పోవడానికి దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలలు పడితే, ఒక్క స్ట్రా భూమిలో కలిసిపోవడానికి దాదాపు 200  సంవత్సరాలు పడుతుంది. అయితే  పర్యావరణానికి  ఎంత నష్టం  కలిగిస్తూ  ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్క ప్రకారం ప్రపంచమంతటా రోజు ఎన్ని స్ట్రాలు వేస్ట్ అవుతున్నాయో, అది భూమికి ఎంతలా భారం అవుతున్నాయి ఊహించండి..


అయితే ఈ పర్యావరణాన్ని సంరక్షించడానికి హైదరాబాద్లోని రిట్రో స్ట్రాస్ కంపెనీ.. సరికొత్త వినూతనాన్ని చేపట్టింది. అది ఏమిటంటే భూమిలో కలిసిపోయే స్ట్రాలను తయారు చేస్తోంది. వాటిని మనం తినే ఆహార పదార్థాలైన గోధుమలు, రైస్, టాపియోకా, నీటితో తయారు చేస్తోంది. ఇందులో ఎలాంటి రసాయన పదార్థాలు వాడడం లేదు..


అయితే ఒకసారి వాడిన తరువాత  ఈ స్ట్రాలను పడేయనవసరంలేదు,  వీటిని అలాగే తినవచ్చు కూడా. వీటిని రిట్రో స్ట్రాస్ మేనేజింగ్ డైరెక్టర్ విదీత్ ముప్పిడి తెలిపారు. అయితే ఈ స్ట్రా ను తయారు చేసేటప్పుడు వీటిలో కలిపే రంగులు క్యారెట్ నుంచి ఆరెంజ్ కలర్, బీట్ రూట్ నుండి రెడ్ కలర్, అలాగే బచ్చలికూర నుండి గ్రీన్ కలర్ ను సేకరించారు. కూల్ డ్రింక్స్ లో ముంచినా ఈ స్ట్రా లు ఒక గంట పాటు గట్టిగానే ఉంటాయి. వీటిని వాడడం వల్ల మనతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్ట్రా లు ఏడాది వరకు నిల్వ ఉంటాయి.


కాటేదాన్ లో ఉన్న ఈ కంపెనీ రోజుకు 15,000 నుంచి లక్ష వరకు స్ట్రా లను తయారుచేస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే ఎకో   ఫ్రెండ్లీ కాఫీ కప్పు లను కూడా తయారు చేస్తామని చెబుతున్నారు. అలాగే తినదగిన ప్లేట్లను కూడా తయారు చేస్తామంటున్నారు. ఏది ఏమైనా వీరు చేసే పనులు పర్యావరణంతో పాటు వినడానికి కూడా అద్భుతంగా ఉన్నాయి.. ఇక అదే గనుక జరిగితే సాధ్యమైనంతవరకు పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: