
మనోళ్ళు ఏంటి చైనా వాళ్ళ కంటే దారుణంగా తయారవుతున్నారు ?
ప్రపంచంలో ఏ దేశస్థుడు తినని విధంగా చైనా దేశంలో ఉన్న ప్రజలు పురుగులను, పాములను, కప్పలను.. మన దేశంలో ఉన్న ప్రజలు చెకోడీలు తిన్నట్టు వాళ్ళు తింటారు అని అంటుంటారు. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రపంచంలో రావటానికి కారణం చైనా దేశానికి చెందిన వ్యక్తి గబ్బిలం తినటం వల్ల అన్ని ఒక వార్త కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే మనోళ్లు కూడా చైనా వాళ్ళ లాగే దారుణంగా తయారవుతున్నారు. మంచి ఆకలి మీద ఉన్నారేమో ఏకంగా మొసలిని చంపేసి తినేశారు. దరిద్రపు ఆహారపు అలవాట్లు వల్ల లేనిపోని వైరసులు అంటురోగాలు వస్తున్నా గాని మన వాళ్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

ఈ ఉదంతం ఒడిషాలో చోటుచేసుకుంది. మల్కాన్ గిరి జిల్లాలోని పొడియా బ్లాకులో కలదపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు గ్రామానికి దగ్గరలో శబరీ అనే నదిలో ఒక మొసలిని పట్టుకున్నారు. దాదాపు ఐదు అడుగుల పొడవు ఉన్న ముసలి దొరకటం తోనే చేతుల్ని నరికి చంపేశారు. అనంతరం మొసలి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ యువకులంతా పంచుకున్నారు.

ఇంతలో అధికారులు రావటం తో ఆ యువకులు మొసలిని చంపినట్లు గుర్తించారు. తర్వాత వెంటనే పోలీసుల దాకా ఈ విషయం వెళ్లడంతో విచారణ చేపట్టి… చేసిన పని చట్టవిరుద్ధమని వెంటనే మొసలిని చంపిన వాళ్ళని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గ్రామంలో ప్రజలు ఈ విషయం తెలుసుకుని అసలు వీరంతా చైనాలో పుట్టాల్సిన వాళ్లు పొరపాటున మన గ్రామంలో జన్మించారు అని మండిపడ్డారు.